IPL 2022: ఐపీఎల్‌లో పరుగుల వరద పారుతుంటుంది. క్రికెటర్లు కొత్త కొత్త షాట్లను తమ అభిమానులకు పరిచయం చేస్తుంటారు. బౌండరీలు, సిక్సులు బాదుతూ గ్రౌండంతా బంతిని పరుగులు పెట్టిస్తారు. మరోవైపు బౌలర్లు తమ పదునైన బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటారు. ఇలా తమ జట్లను గెలిపించి ఎంతో మంది 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకుంటారు. మరి ఐపీఎల్‌లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం
IPL man of the match awards
ఏబీ డివిలియర్స్
ఐపీఎల్ చరిత్రలో ఏబీ డివిలియర్స్ అత్యధిక సార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. 156 ఇన్నింగ్స్ ఆడిన మిస్టర్ 360 ఇప్పటివరకు 23 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో ఏబీడీ 151.91 స్ట్రైక్ రేటుతో 4,849 పరుగులు చేశాడు.
క్రిస్ గేల్
విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన క్రిస్ గేల్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ యూనివర్సల్ బాస్ బ్యాట్‌తో బరిలోకి దిగితే సిక్సులు, బౌండరీల వర్షం కురవాల్సిందే. ఇప్పటి వరకు గేల్ 22 సార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. 150.11 స్ట్రైక్ రేటుతో గేల్ 4772 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 6 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు కూడా గేల్ పేరిట ఉన్నాయి.