IPL 2022 Venue: దేశంలో కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2022 వేదిక గురించి సందిగ్ధత నెలకొంది. తొలుత ఈ సీజన్‌ను స్వదేశంలో నిర్వహించాలని భావించినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అందుకే ఈ మెగాలీగ్ వేదిక విషయంలో ప్లాన్ బీని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు. ఈ సారి దక్షిణాఫ్రికా లేదా శ్రీలంకలో మెగాలీగ్ను నిర్వహించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఐపీఎల్ 2022 కోసం ప్లాన్ బి.. వేదిక ఎక్కడంటే? - ఐపీఎల్ లేటెస్ట్ న్యూస్
IPL 2022 Venue: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికా లేదా శ్రీలంకలో నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. మొదట్లో ఐపీఎల్‌ను స్వదేశంలోనే నిర్వహించాలని భావించినా.. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వెల్లడించారు.
ఐపీఎల్ 2022
ఈ సీజన్లో ఇప్పటికే ఉన్న జట్లతో పాటు మరో రెండు కొత్త టీమ్స్ కూడా బరిలో దిగబోతున్నాయి. దీంతో టోర్నీ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే మెగావేలం నిర్వహణ కోసం పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఈ వేలం ప్రక్రియ జరగనుంది.