ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్‌న్యూస్. మార్చి 26 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయమై గురువారం జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మే 29న ఈ సీజన్ ముగుస్తుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ పేర్కొన్నారు.
ఈసారి ఐపీఎల్ మ్యాచులు మొత్తం.. మహారాష్ట్రలోనే జరగనున్నాయి. ఇందులో భాగంగా ముంబయిలో 55, పుణెలో 15 మ్యాచ్‌ల్ని నిర్వహిస్తారు. వీటిలో వాంఖడే 20, బ్రబోర్న్ 20, డీవై పాటిల్ స్టేడియం 15, ఎమ్సీఏ గ్రౌండ్ 15 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.