తెలంగాణ

telangana

ETV Bharat / sports

వచ్చే ఐపీఎల్​ సీజన్​కు ఈ ఐదుగురు ఆటగాళ్లు డౌటే! - ఐపీఎల్​ న్యూస్

IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్​లో కొంతమంది ఆటగాళ్లు అంచనాలను అందుకోలేక దారుణంగా విఫలమయ్యారు. మరికొంత మంది మాత్రం అవకాశాలు దక్కక రిజర్వు బెంచ్​కే పరిమితమయ్యారు. ఇలాంటి ప్లేయర్లలో కొందరిని ఫ్రాంచైజీలు వదులుకునే అవకాశం ఉంది. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

IPL 2022
మాథ్యూ వేడ్

By

Published : May 25, 2022, 10:34 AM IST

IPL News: ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​లో కొంత మంది ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారు. మరికొంతమంది ఫేమస్ ప్లేయర్లు మాత్రం పేలవ ప్రదర్శనతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. సత్తా చాటితేనే ఐపీఎల్​లో మనుగడ ఉంటుంది. భారంగా మారితే ఎంతటి ఆటగాళ్లనైనా వదులుకునేందుకు ప్రాంఛైజీలు ఏ మాత్రం వెనుకాడవు. ఈ సీజన్​లో కొంతమంది ప్లేయర్లు రిజర్వ్​ బెంచ్​కే పరిమితమయ్యారు. వాళ్లకు అవకాశం కూడా దక్కలేదు. ఈ జాబితాలో ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లున్నారు. వీరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే సీజన్​కు వీరు జట్టులో ఉండటం అనుమానమే. అలాగే ఫేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను కూడా ఫ్రాంచైజీలు వదులుకునే అవకాశముంది. అలాంటి ఆటగాళ్లలో టాప్​-5లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం.

బెన్నీ హోవెల్

బెన్నీ హోవెల్​:ఈ ఇంగ్లీష్ ఆల్​రౌండర్​ను వేలంపాటలో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అయితే జట్టులో ఇప్పటికే మంచి విదేశీ ఆటగాళ్లు ఉండటం వల్ల బెన్నీ హోవెల్​కు అవకాశాలు దక్కలేదు. రిజ్వర్ బెంచ్​కే పరిమితమయ్యాడు. తన సత్తా చూపేందుకు ఒక్క ఛాన్స్​ కూడా ఇవ్వకపోవడంపై బెన్నీ తీవ్ర అసహనంతో ఉన్నాడు. ఇదే అభిప్రాయాన్ని ట్విట్టర్లో బాహటంగానే వ్యక్తం చేశాడు. సన్​రైజర్స్​తో మ్యాచ్లో తనకు చోటివ్వకపోవడంపై అసంతృప్తితో ట్వీట్ చేశాడు. దీంతో ఫ్రాంచైజీ కూడా అతనిపై అనాసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వేలంపాటకు అతన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

డేరిల్​ మిచెల్

డేరిల్​ మిచెల్​:ఈ కివీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్​ గతేడాది టీ20 వరల్డ్ కప్​లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్​ ఇతడ్ని వేలంపాటలో కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్​ మొత్తంలో అతనికి రెండు మ్యాచుల్లో ఆడే అవకాశమే దక్కింది. అందులో మొత్తం 33 పరుగులు చేశాడు. రాయల్స్ టాప్ ఆర్డర్​లో దేవ్​దత్ పడిక్కల్​, యశస్వి జైశ్వాల్​, జోస్ బట్లర్ వంటి మంచి ఆటగాళ్లు ఉండటం వల్ల మిచెల్​కు అవకాశాలు దక్కడం లేదు. దీంతో ఈ ఆటగాడ్ని రాజస్థాన్ రాయల్స్ వదులుకునే అవకాశం ఉంది. అయితే 2023 సీజన్​కు ఇతడ్ని కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపకపోవచ్చు. ఈలోపు అంతర్జాతీయ మ్యాచుల్లో విశేషంగా రాణిస్తే మాత్రం ఫ్రాంచైజీ ఇతనివైపు చూసే అవకాశం ఉంది.

ఆరోన్ ఫించ్

ఆరోన్ ఫించ్​:ఆరోన్ ఫించ్ ఇప్పటికే ఐపీఎల్​లో చాలా జట్ల తరఫున ఆడాడు. 2022 సీజన్​కు కోలకతా నైట్ రైడర్స్ అతడ్ని అలెక్స్ హేల్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కొనుగోలు చేసింది. రెండు మ్యాచుల్లో మినహా ఫించ్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. దీంతో సీజన్​ చివరి మ్యాచ్​లకు ముందే అతడ్ని జట్టు యాజమాన్యం పక్కకుపెట్టింది. అంతేకాదు వచ్చే వేలంపాటకు అతడ్ని విడుదల చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ మ్యాచుల్లో అద్భుతంగా రాణించే ఫించ్.. ఐపీఎల్​కు వచ్చేసరికి ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ఈ ఆటగాడు వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకుని వేలంపాటుకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువే.

డేవిడ్ విల్లీ

డేవిడ్ విల్లీ:ఈ ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. మొదట్లో ఛాన్స్​లు ఇచ్చినప్పటికీ ఇతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో జట్టు యాజమాన్యం అతడ్ని పక్కకు పెట్టింది. ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్​ పేసర్ బెహ్రెన్​డార్ఫ్ ఇప్పటికే ఆర్​సీబీ రిజర్వ్​డ్​​ ప్లేయర్లలో ఉన్నాడు. దీంతో డేవిడ్​ విల్లీని వచ్చే వేలంపాటకు విడుదల అవకాశం ఉంది. ఈ ఏడాది ఆర్​సీబీ తరఫున నాలుగు మ్యాచ్​లు ఆడిన విల్లీ.. కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. టీ20లో అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి ఇది ఏమాత్రం మంచి ప్రదర్శన కాదు.

మాథ్యూ వేడ్

మాథ్యూ వేడ్​ :గతేడాది ఆస్టేలియా టీ20 వరల్డ్​కప్​ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మాథ్యూ వేడ్​.. ఐపీఎల్​లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్​.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ సీజన్​లో 9 మ్యాచ్​లు ఆడి 16.56 సగటు, 116.4 స్ట్రయిక్ రేట్​తో కేవలం 149 పరుగులే చేశాడు. టాప్ ఆర్డర్​ను మరింత పటిష్ఠం చేసుకోవాలనుకుంటున్న గుజరాత్​.. వచ్చే వేలంపాటలో వేడ్​ను వదులుకొని, మరో మంచి ఆటగాడ్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:IPL 2022: అరంగేట్రంలోనే ఫైనల్​కు గుజరాత్​.. రాజస్థాన్​పై గెలుపు

ABOUT THE AUTHOR

...view details