IPL 2022: ఐపీఎల్ 2022 ఆరంభంలోనే ముంబయి ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ తగలనుంది! ఈ మెగా టోర్నీలో మార్చి 27న తన తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది ముంబయి. అయితే, ఈ మ్యాచ్‌కు ప్రధాన బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశం ఉంది. అతడు ఇటీవల గాయపడటం వల్ల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. అతడింకా కోలుకోలేకపోవడం వల్ల దిల్లీతో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడించొద్దని ముంబయి యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తొలి మ్యాచ్ తర్వాత ముంబయి ఏప్రిల్ 2న రాజస్థాన్‌తో రెండో మ్యాచ్‌లో ఆడనుంది. అప్పటికల్లా సూర్యకుమార్ కోలుకుంటాడని ఆశిస్తోంది. కాగా, ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు.