తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్​లోకి రైనా.. ఈసారి కొత్త అవతారంలో

IPL 2022: చెన్నై జట్టును నాలుగు సార్లు కప్పు గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన సురేశ్​ రైనా.. మరోసారి ఐపీఎల్​లోకి అడుగు పెట్టనున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్​ 2022లో హిందీ కామెంటర్​గా కనిపించనున్నాడు.

IPL 2022:
ఐపీఎల్​లోకి రైనా

By

Published : Mar 16, 2022, 10:43 AM IST

IPL 2022:మిస్టర్​ ఐపీఎల్​గా పేరొందిన సురేశ్​ రైనా సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే సీజన్​లో కామెంటేటర్​గా కనిపించనున్నాడు. రైనా తొలిసారిగా ఐపీఎల్​లో పాల్గొనడంలేదు. గత నెలలో జరిగిన మెగావేలంలో రైనాను కొనడానికి ఏ జట్టూ ఆసక్తి చూపలేదు.

రవిశాస్త్రి కూడా కామెంటేటర్​గా తన ప్రస్థానాన్ని తిరిగి మొదలు పెట్టనున్నాడు. 2017లో టీమ్​ఇండియా హెడ్​కోచ్​గా నియమితులైన అనంతరం కామెంటర్​గా దూరమయ్యాడు. ఐపీఎల్​లో కొత్తగా వచ్చిన జట్లకు కోచ్​గా మారుతారని భావించినా అది జరగలేదు. రైనా, రవిశాస్త్రి ఐపీఎల్ హిందీ కామెంటరీలో పాల్గొననున్నారు.

ఐపీఎల్​లో చెన్నై జట్టు తరపున 176 మ్యాచ్​లు ఆడిన సురేశ్​ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్​లో మొత్తం 205 మ్యాచ్​లు ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు.

ఇదీ చదవండి:IPL 2022: ముంబయికి ఎదురుదెబ్బ.. స్టార్​ ప్లేయర్​ దూరం!

ABOUT THE AUTHOR

...view details