IPL 2022 Sunrisers Hyderabad: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానున్న తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేసర్ భువనేశ్వర్ కుమార్ గురువారం ప్రాక్టీస్ శిబిరానికి చేరుకున్నాడు. గత నెలలో బెంగుళూరులో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో అతడిని సన్‌రైజర్స్ జట్టు రూ.4.2 కోట్లకు దక్కించుకుంది.
బౌలింగ్ కోచ్ కూడా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ డేల్ స్టేన్ కూడా జట్టు శిబిరంలోకి వచ్చి చేరాడు. సన్‌రైజర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా రావడం ఆనందంగా ఉందని డేల్స్టేన్ అన్నాడు.
ఫుడ్ యాక్టివిటీలో సరదాగా..
సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ నిర్వహించిన ఫుడ్ యాక్టివిటీ (ఆహారాన్ని గుర్తు పట్టే) గేమ్‌లో ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్ ఎంజాయ్ చేశారు. ఇద్దరి కళ్లకు గంతలు కట్టి.. వారి ముందు ఉంచిన ప్లేట్లో ఆహారాన్ని రుచి చూసి గుర్తు పట్టాలని యాజమాన్యం టాస్క్ ఇచ్చింది. సరదాగా సాగిన ఈ పోటీలో అభిషేక్ శర్మ గెలిచాడు. ఐపీఎల్ మెగా వేలంలో ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మను రూ.6.5 కోట్లకు కొనుగోలు చేయగా, గార్గ్‌ను రూ.20 లక్షలకు దక్కించుకుంది సన్‌రైజర్స్ జట్టు.
ఫుట్‌బాల్ ఆడుతూ..
ఇక ప్రాక్టీస్ సెషన్లో అలసట తీర్చుకోవడానికి ఆటగాళ్లు సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో ఆటగాడితో కాసేపు ఫుట్‌బాల్ ఆడాడు.
ఇదీ చదవండి:IPL 2022 Delhi Capitals:దిల్లీ కల ఈ సారైనా నెరవేరేనా!