తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​ గెలవాలంటే.. ఈ ప్లేయర్స్​ రాణించాల్సిందే! - భువనేశ్వర్​ ఐపీఎల్ 2022

IPL 2022 Sunrisers Hyderabad: ఈ ఐపీఎల్​ సీజన్​ కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్​ బెర్తు కోసం ఉత్కంఠగా పోరు కొనసాగుతోంది. అయితే, హైదరాబాద్‌ ఓ దశలో వరుస విజయాలు సాధించినా.. గత నాలుగు మ్యాచ్‌లు ఓటమిపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కేన్​ సేన మళ్లీ విజయాల బాట పట్టాలంటే జట్టులో కొంతమంది ప్లేయర్స్​ రాణించాల్సిన అవసరం ఉంది. మరి వారెవరంటే...

kane williamson sunrisers hyderabad
కేన్​ విలియమ్సన్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​

By

Published : May 9, 2022, 8:34 AM IST

Updated : May 9, 2022, 8:50 AM IST

IPL 2022 Sunrisers Hyderabad: భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. అన్ని జట్లు ఇక ఆడాల్సిన మ్యాచ్‌లు మూడు, నాలుగే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తులు దాదాపు ఖరారు చేసుకున్న లఖ్‌నవూ, గుజరాత్, రాజస్థాన్​ తప్పించి బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌, పంజాబ్‌, కోల్‌కతా మిగతా స్థానాల కోసం పోటీపడుతున్నాయి. అయితే, హైదరాబాద్‌ ఒక దశలో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలుపొంది టాప్‌లో నిలిచేలా కనిపించినా గత నాలుగు మ్యాచ్‌లు ఓటమిపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌ చేరాలంటే కేన్‌ మామ జట్టులో ఈ ఆటగాళ్లు రాణించాలి..

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ అవసరం..: ఈ సీజన్‌లో కెప్టెన్‌ విలియమ్సన్‌ తడబడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం మినహాయించి మరో భారీ ఇన్నింగ్స్ ఆడింది లేదు. ఇప్పుడు మిగతా జట్లతో పోటీ తీవ్రమవడంతో ఇకపై రాణించక తప్పదు. టాప్‌ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌ రాణిస్తున్నా విలియమ్సన్‌ ఒక్కడే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో ఇప్పుడు అతడు గేర్‌ మార్చాల్సిన అవసరం ఉంది. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో కేన్‌ మామ బ్యాట్‌ ఝుళిపిస్తే ఈ విభాగంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

భువి వికెట్లు తీయాల్సిందే..: ఇక బౌలింగ్‌ యూనిట్‌లో హైదరాబాద్‌కు పెద్ద దిక్కు భువనేశ్వర్‌ కుమార్‌ అనే సంగతి అందరికీ తెలిసిందే. తన స్వింగ్‌ బౌలింగ్‌ వైవిధ్యంతో మంచి పేరు సంపాదించుకున్న అతడు ఈ సీజన్‌లో (7.30 ఎకానమీ) పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నా.. వికెట్లు తీయలేక తంటాలు పడుతున్నాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 10 వికెట్లే తీశాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ఇకపై ప్రత్యర్థులను కట్టడి చేయాలంటే భువి పదునైన బంతులు సంధించి వికెట్లతో చెలరేగాల్సిందే. లేదంటే రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇతర జట్లు ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది.

నటరాజన్‌ రావాల్సిందే..: హైదరాబాద్‌ బౌలింగ్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా(17) కొనసాగుతున్న నటరాజన్‌ దిల్లీతో ఆడిన గతమ్యాచ్‌లో గాయం కారణంగా తుది జట్టులో లేడు. వికెట్లు తీయడంలో, పొదుపుగా బౌలింగ్‌ చేయడంలో నటరాజన్‌ ఈ సీజన్‌లో మంచిపేరు తెచ్చుకున్నాడు. డెత్‌ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థులను చిత్తు చేసే అతడు తుది జట్టులోకి తిరిగి వస్తే జట్టుకు మరింత ఉపయోగం. రాబోయే మ్యాచ్‌ల్లో నటరాజన్‌కు తోడు భువనేశ్వర్‌ కూడా వికెట్లు సాధిస్తే హైదరాబాద్‌కు తిరుగుండదు. ప్రస్తుతం నట్టూ.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్‌-4లో నిలిచాడు.

ఉమ్రాన్‌ నువ్వు కూడా..: ఇప్పటికే ఈ సీజన్‌లో అత్యధిక వేగంతో బంతులు సంధిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బౌలర్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. నిలకడగా 150కిమీ వేగానికి పైగా బంతుల్ని బుల్లెట్లలా విసురుతున్నాడు. ఈ క్రమంలోనే ఆడిన 11 మ్యాచ్‌ల్లో మొత్తం 15 వికెట్లు పడగొట్టి రాణిస్తున్నాడు. అయితే, గత మూడు మ్యాచ్‌ల్లో అతడు ఒక్క వికెట్‌ కూడా తీయకపోగా ధారాళంగా పరుగులిచ్చాడు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇలాగే బౌలింగ్‌ చేస్తే జట్టుకు కష్టాలు తప్పవు. ఉమ్రాన్‌ వేగంతోపాటు వైవిధ్యాన్ని కూడా జోడిస్తే జట్టుకు మంచి ఫలితాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ మూడు జట్లు ఓడితేనే.. సన్​రైజర్స్​ చివరి మూడు మ్యాచ్​లు గెలిచినా నెట్​ రన్​రేట్​తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. హైదరాబాద్​​తో పాటు దిల్లీ క్యాపిటల్స్​, పంజాబ్​ కింగ్స్​ 11 మ్యాచుల్లో ఐదేసి విజయాలతో 5,6,7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. కేన్​ సేన​ ప్లే ఆఫ్స్​ చేరాలంటే నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ మిగాతా రెండు మ్యాచుల్లో ఒకటి లేదా రెండు ఘోరంగా ఓడాలి. సన్​రైజర్స్​ మిగతా మూడు మ్యాచ్​లను భారీ తేడాతో పాటు మెరుగైన రన్​రేట్​తో విజయం సాధించాలి. హైదరాబాద్ తర్వాతి మ్యాచుల్లో కోల్​కతా, ముంబయి, పంజాబ్​ జట్లతో తలపడనుంది. అయితే కోల్​కతా, ముంబయి ఇప్పటికే ప్లే ఆఫ్స్​ రేసు నుంచి తప్పుకున్నాయి. పంజాబ్​ కింగ్స్​ను ఓడిస్తే ఆ జట్టు కూడా నిష్క్రమిస్తోంది. మే 11న రాజస్థాన్​తో జరిగే మ్యాచ్​లో దిల్లీ ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్​ రేసు నుంచి తప్పుకుంటుంది. అప్పుడు మెరుగైన రన్​రేట్​ సాధిస్తే హైదరాబాద్​కు అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి: అందుకే నేను కెప్టెన్‌ అవ్వలేకపోయా: స్పష్టతనిచ్చిన యువీ

Last Updated : May 9, 2022, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details