IPL 2022: 2016లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి.. 2018లో తుది సమరం వరకు వెళ్లిన సన్‌రైజర్స్ జట్టు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శనతో అదరగొట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఫ్రాంచైజీకి చెందిన ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. అయితే, ప్రాక్టీస్ గ్యాప్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లంతా పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్‌ను చెబుతూ అలరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఫ్రాంఛైజీ పోస్టు చేసింది. భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లు తగ్గేదేలే అంటూ పుష్పరాజ్‌ను అనుసరించారు. వీరిలో ఎవరు బాగా చేశారో చెప్పాలంటూ నెటిజన్లను కోరింది సన్‌రైజర్స్.
IPL 2022: సన్‌రైజర్స్ 'తగ్గేదేలే'.. పుష్ప స్టైల్లో ఇరగదీసిన ప్లేయర్లు
IPL 2022: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో సన్‌రైజర్స్ జట్టు నెట్స్‌లో ప్రాక్టీస్ షూరూ చేసింది. ప్రాక్టీస్ గ్యాప్‌లో జట్టు ఆటగాళ్లు భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లు తగ్గేదేలే అంటూ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Sunrisers Hyderabad: 2013లో లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు అప్పటి నుంచి నిలకడగా రాణిస్తోంది. కానీ గతేడాది డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీతో సహా జట్టు నుంచి కూడా తొలగించింది. ఈ ఏడాది మెగా వేలానికి ముందు కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమ్మద్, ఉమ్రాన్ మాలిక్‌లను రిటైన్ చేసుకుంది సన్‌రైజర్స్ జట్టు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ను జట్టు తిరిగి సొంతం చేసుకోగా.. నికోలస్ పూరన్‌ను భారీ ధరకు దక్కించుకుంది. రషీద్ ఖాన్ వదులుకున్న హైదరాబాద్ జట్టు వాషింగ్టన్ సుందర్‌తో స్పిన్నర్ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో భాగంగా.. మార్చి 29న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఇదీ చదవండి: ఐపీఎల్లో 'సూ..పర్' మచ్చి.. మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌లివే