IPL 2022: ఐపీఎల్ 2022లో దిల్లీ క్యాపిటల్స్ సహాయక కోచ్‌గా వ్యవహరించనున్నాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్. లీగ్ చరిత్రలో వాట్సన్‌కు ఘన చరిత్ర ఉంది. 3874 పరుగులు, 92 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. చివరిసారి చెన్నైసూపర్ కింగ్స్‌కు ఆడిన వాట్సన్.. 2020లో ఫ్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
అగార్కర్ కూడా..!
గడిచిన మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన దిల్లీ క్యాపిటల్స్.. వాట్సన్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఫ్రాంఛైజీ హెడ్‌కోచ్‌గా ఉన్న ఆసీస్ మాజీ సారథి రిక్కీ పాంటింగ్ అతడి పేరును సూచించినట్లు సమాచారం. ఇక వాట్సన్‌తో పాటు టీమ్ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ కూడా దిల్లీ కోచింగ్ విభాగంలో చేరనున్నట్లు తెలుస్తోంది.