తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నాపై నమ్మకం ఉంచండి.. ఐపీఎల్​లో బాగా రాణిస్తా' - దిల్లీ క్యాపిటల్స్ సర్ఫరాజ్​ ఖాన్​

IPL 2022 Sarfaraz Khan: ఐపీఎల్​లో తాను కూడా మంచి స్కోరు చేసే రోజు వస్తుందని రంజీ బ్యాటర్​ సర్ఫరాజ్​ ఖాన్​ అన్నాడు. తనపై నమ్మకం ఉంచాలని ఈ ఏడాది అతడిని కొనుగోలు చేసిన దిల్లీ క్యాపిటల్స్ జట్టును కోరాడు.

ipl 2022
sarfaraz khan

By

Published : Mar 13, 2022, 8:55 AM IST

IPL 2022 Sarfaraz Khan: అండర్​-19 ప్రపంచకప్​ టోర్నీల్లో రెండు సార్లు భారత్ జట్టుకు​ ప్రాతినిథ్యం వహించిన ఆటగాడు సర్ఫరాజ్​ ఖాన్. అయితే అతడు తన దూకుడు ఎక్కువ కాలం చూపలేకపోయాడు. గత కొన్ని సీజన్ నుంచి ఐపీఎల్​లో ఆడుతున్నప్పటికీ తన బ్యాటింగ్​తో ఆకట్టుకోలేకపోయాడు. అయితే గతేడాది పంజాబ్​ తరఫున ఆడిన ఇతడిని ఈ సారి​ మెగా వేలంలో దిల్లీ క్యాపిటల్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. త్వరలోనే ఈ మెగాటోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. ఈ లీగ్​లో కొత్త జెర్సీ ధరించి ఆడడానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు. తనపై నమ్మకం ఉంచాలని దిల్లీ జట్టు యాజమాన్యాన్ని కోరాడు.

"ఏ జట్టు అయినా నాపై నమ్మకం ఉంచితే బాగా రాణించగలను. టీ20, వన్డే మ్యాచు​ల్లో సరిగ్గా రాణించలేనని అందరూ భావిస్తున్నారు. కానీ నాకు అవకాశం ఇస్తే బాగా ఆడతా. నేను కూడా ఐపీఎల్​లో మంచి స్కోరు చేసే రోజు వస్తుంది"

-సర్ఫరాజ్ ఖాన్

సర్ఫరాజ్​ ఖాన్​ ఇప్పటివరకు ఐపీఎల్​లో​ 40 మ్యాచులు ఆడి కేవలం 441 పరుగులే సాధించాడు. 2015 నుంచి 2018 వరకు ముంబయి ఇండియన్స్​, 2019 నుంచి 2021 వరకు పంజాబ్​ కింగ్స్​ తరఫున ఆడాడు. ఇటీవలే జరిగిన రంజీ ట్రోఫీ 2021-22లో మూడు మ్యాచులు ఆడి 551 పరుగులు చేశాడు. 137.75 సగటుతో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కాగా, మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు తరఫున ఆడబోతున్నాడు. ఐపీఎల్​ కప్​ను ఐదు సార్లు గెలుచుకున్న ముంబయి ఇండియన్స్​తో దిల్లీ క్యాపిటల్స్​ మార్చి 27న తన తొలి మ్యాచ్​ను ఆడనుంది.

ఇదీ చదవండి:ఝులన్​ గోస్వామి రికార్డు.. ప్రపంచకప్​ చరిత్రలో అత్యధిక వికెట్లు

ABOUT THE AUTHOR

...view details