తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అది మాకు కలిసొచ్చే అంశం.. ఐపీఎల్​ ట్రోఫీ మాదే' - శాంసన్​

IPL 2022 Sanju Samson: రెండో సారి ఐపీఎల్​ కప్పును గెలవాలనే 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఈ ఏడాది తెరదించుతామని రాజస్థాన్​ జట్టు కెప్టెన్​ సంజూ శాంసన్​ ధీమా వ్యక్తం చేశాడు. గత సీజన్ల కన్నా ఈ సారి జట్టు చాలా బలంగా ఉందని, కప్పును గెలుచుకునే అవకాశాలు తమకు ఎక్కువగా ఉన్నట్లు తెలిపాడు.

ipl 2022
sanju samson

By

Published : Mar 28, 2022, 4:37 PM IST

IPL 2022 Sanju Samson: ఐపీఎల్‌లో రెండో టైటిల్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. 2008లో తొలిసారి విజేతగా నిలిచిన ఆ జట్టుకు మళ్లీ ఆ ముచ్చట తీరలేదు. అయితే ఈ సారి కచ్చితంగా టైటిల్​ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు ఆ జట్టు సారథి సంజూ శాంసన్​.

"గత రెండు మూడు సీజన్ల నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఈ ఏడాది జట్టులో మార్పులు చేశాం. కొంతమంది కొత్త ఆటగాళ్లను తీసుకున్నాం. అందరం కలిసి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నాం. ఈ సీజన్​లో మా జట్టు బలంగా మారింది. టీమ్​లో జాతీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఐపీఎల్ అనేది​ సుదీర్ఘమైన టోర్నమెంట్​ కనుక జట్టు ఆటగాళ్ల ఫిట్​నెస్​ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. లసిత్​ మలింగ, కుమార సంగక్కర లాంటి దిగ్గజ ఆటగాళ్లు .. జట్టుకు కోచ్​లుగా ఉండటం మాకు కలిసొచ్చే అంశం. మలింగ.. ప్రతి బౌలర్​కు సులభతరమైన మెలకువలను నేర్పిస్తున్నాడు. నాకు కూడా సహకారం అందిస్తున్నాడు. ఈ సారి మేం కప్పు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి."

-సంజూ శాంసన్​, రాజస్థాన్​ జట్టు కెప్టెన్​

ఐపీఎల్​ 2022లో భాగంగా మార్చి 29న (మంగళవారం) రాజస్థాన్​ రాయల్స్​ జట్టు.. తన మొదటి మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడనుంది. ఈ ఏడాది మెగా వేలానికి మందు రాజస్థాన్​ జట్టు.. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (రూ.14 కోట్లు), బట్లర్‌ (రూ.10 కోట్లు), యశస్వి జైశ్వాల్​ను(రూ.4 కోట్లు) రిటైన్​ చేసుకుంది. ఇంకా వీరితో పాటు మరో 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

ఇదీ చదవండి: దిల్లీ ప్రధాన ఆల్​రౌండర్​కు గాయం.. ఐపీఎల్​ నుంచి ఔట్​?

ABOUT THE AUTHOR

...view details