IPL 2022 RCB celebrations: ఐపీఎల్లో గతరాత్రి దిల్లీపై ముంబయి గెలవడం వల్ల బెంగళూరు నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. శనివారం రాత్రి ముంబయి-దిల్లీల మధ్య పోరు జరుగుతున్నంతసేపు ఉత్కంఠతతో మ్యాచ్‌ను తిలకించిన ఆటగాళ్లు.. చివరికి ముంబయి గెలవగానే ఎగిరి గంతులేశారు. ప్రతిఒక్కరూ ఆనందంలో చిందులేశారు. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ సహా ప్రతిఒక్కరూ సంబరాలు చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఆర్సీబీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ముంబయి విజయంతో ఆర్సీబీలో ఫుల్‌జోష్.. చిందులేస్తూ సంబరాలు - ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్
IPL 2022 RCB celebrations: కీలక మ్యాచ్‌లో దిల్లీపై ముంబయి గెలవడం వల్ల ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరింది. దీంతో బెంగళూరు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆటగాళ్లంతా చిందులేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆ వీడియోను చూసేయండి...
![ముంబయి విజయంతో ఆర్సీబీలో ఫుల్‌జోష్.. చిందులేస్తూ సంబరాలు IPL 2022 Playoffs RCB Celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15353711-thumbnail-3x2-ipl.jpg)
కాగా, ముంబయి చేతిలో దిల్లీ 5 వికెట్ల తేడాతో ఓడింది. మొదట దిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆ జట్టులో పావెల్ (43; 34 బంతుల్లో 1×4, 4×6), పంత్ (39; 33 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో బుమ్రా (3/25) విజృంభించాడు. రమణ్‌దీప్ (2/29) కూడా మెరిశాడు. ఛేదనలో ముంబయి 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఇషాన్ కిషన్ (48; 35 బంతుల్లో 3×4, 4×6), డేవిడ్ (34; 11 బంతుల్లో 2×4, 4×6) సత్తాచాటారు. దిల్లీ బౌలర్లలో శార్దూల్ (2/32), నోకియా (2/37) ఆకట్టుకున్నారు.
ఇదీ చూడండి: పాపం రోహిత్.. ఇలా జరగడం ఇదే తొలిసారి!