IPL 2022: దేశంలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. క్రికెట్ ప్రియుల దృష్టంతా ఈ మహా సంగ్రామంపైకి మళ్లింది. ఈ ఏడాది లీగ్‌లోకి కొత్తగా చేరిన రెండు జట్లతో కలిపి మొత్తం పది జట్లు తలపడనున్నాయి. క్రీడా ప్రపంచంలో ఉన్న లీగ్స్ అన్నింటిలో ఐపీఎల్ రూటే వేరు. ఏ లీగ్ ఇవ్వలేని లాభాల్ని ఐపీఎల్ ఆటగాళ్లతో పాటు బీసీసీఐకు ఇస్తుంది. ఇప్పటివరకు లీగ్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు వంద కోట్ల రూపాయలకు పైగా ఆర్జించారు. ఇక, ఐపీఎల్లో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లు ఎవరు? ఎంతెంత సంపాదించారు? వంటి వివరాలను ఓ సారి పరిశీలిద్దాం..
Players Who Have Earned The Most Money In IPL History
ఏబీ డివిలియర్స్:దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. 2022 ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనలేదు. ఇప్పటివరకు మిస్టర్ 360 మొత్తం రూ.1,02,51,65,000 (100 కోట్లకు పైగా) సంపాదించి లీగ్ లో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. డివిలియర్స్ గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
సురేష్ రైనా:ఒకప్పుడు టీమ్ఇండియా మిడిలార్డర్లో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన రైనా.. తర్వాత ఫామ్ కోల్పోయాడు. చాలాకాలం పాటు తుది జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూసి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక, ఐపీఎల్లో అయినా అతడి ఆట చూడొచ్చనుకున్న అభిమానులకు ఫ్రాంఛైజీలు నిరాశ మిగిల్చాయి. రైనాను ఈ ఏడాది ఏ జట్టు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కాగా, ఇప్పటివరకు ఇతడు రూ. 1,10,74,00,00 (రూ. 110 కోట్లకు పైగా) సంపాదించాడు. రైనా తన ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువ భాగం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు.