తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి మ్యాచ్​లోనే చెన్నైకు షాక్​.. కోల్​కతాకు ఎదురుదెబ్బ! - లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ న్యూస్​

IPL 2022: మరి కొన్నిరోజుల్లోనే ఐపీఎల్​ 2022 ప్రారంభం కానున్న నేపథ్యంలో కోల్​కతా, చెన్నై జట్లకు ఎదురుదెబ్బ తగలనుంది. కోలకతా ప్రధాన ఆటగాళ్లు ప్యాట్​ కమిన్స్​, ఆరోన్​ ఫించ్​ ఐదు మ్యాచులకు దూరం కానుండగా.. మొయిన్​ అలీ తొలి మ్యాచ్​కు దూరం కానున్నాడు.

IPL 2022
IPL 2022 latest news

By

Published : Mar 24, 2022, 9:46 AM IST

IPL 2022: ఐపీఎల్‌-15కు సన్నద్ధమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఆడే తొలి ఐదు మ్యాచ్‌లకు ప్యాట్‌ కమిన్స్‌, ఆరోన్‌ ఫించ్‌ అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ మేరకు ఆ జట్టు మెంటార్‌ డేవిడ్‌ హస్సీ వెల్లడించాడు.

ప్యాట్​ కమిన్స్​

"ఇది ప్రతికూలాంశమే. ఏ జట్టయినా అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండాలని అనుకుంటుంది. కానీ అంతర్జాతీయ ఆటగాళ్లకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతి క్రికెటరూ తమ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనుకుంటాడు. ఆ క్రమంలో వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కమిన్స్‌, ఫించ్‌ తొలి ఐదు మ్యాచ్‌లకు దూరమవుతారని అనుకుంటున్నా. వాళ్లు నాణ్యమైన ఆటగాళ్లు. వచ్చారంటే డ్రెస్సింగ్‌రూమ్‌లో సులువుగా కుదురుకుంటారు" అని హస్సీ అన్నాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉండగా.. ఈ పర్యటన ఏప్రిల్‌ 5న ముగుస్తుంది.

ఆరోన్​ ఫించ్​

తొలి మ్యాచ్‌కు మొయిన్‌ అలీ అనుమానం..

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌ 2022లో తన తొలి మ్యాచ్‌లో మొయిన్‌ అలీ సేవలను కోల్పోయేలా ఉంది. టోర్నీ కోసం మొయిన్‌కు ఇంకా వీసా లభించలేదు. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌తో చెన్నై టైటిల్‌ వేట ఆరంభమవుతుంది. ఒకవేళ మొయిన్‌ సమయానికి రాకపోతే న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే ఐపీఎల్‌ ఆరంగేట్రం చేసే అవకాశం ఉంది. మొయిన్‌ నిరుడు ఐపీఎల్‌లో 15 ఇన్నింగ్స్‌ల్లో 357 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు.

మొయిన్​ అలీ

మార్క్​ వుడ్​ స్థానంలో ఆండ్రూ టై..

ఆస్ట్రేలియా బౌలర్​ ఆండ్రూ టైని జట్టులోకి తీసుకుంది లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​. మోచేతి గాయంతో ఐపీఎల్​ నుంచి దూరమైన ఇంగ్లాండ్​ పేసర్​ మార్క్​వుడ్​ స్థానంలో ఇతడిని భర్తీ చేయనుంది. 27 ఐపీఎల్​ మ్యాచులాడిన టై.. 40 వికెట్లు సాధించాడు. కాగా ఐపీఎల్​ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది.

ఆండ్రూ టై

ఇదీ చదవండి:IPL 2022: ఈసారైనా సన్​ 'రైజ్'​ అయ్యేనా!

ABOUT THE AUTHOR

...view details