తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL New Team: కొత్త ఫ్రాంచైజీలుగా అహ్మదాబాద్, లఖ్​నవూ

IPL
ఐపీఎల్

By

Published : Oct 25, 2021, 7:40 PM IST

Updated : Oct 25, 2021, 8:51 PM IST

14:56 October 25

ఐపీఎల్ కొత్త జట్లివే

వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మరింత రసవత్తరంగా సాగనుంది. కొత్తగా అహ్మదాబాద్‌, లఖ్‌నవూ జట్లు వచ్చి చేరాయి. ఈ విషయాన్ని సోమవారం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఈ) ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌-2022లో మొత్తం 10 జట్లు  టైటిల్‌ పోరులో నిలబడనున్నాయి. అహ్మదాబాద్‌ను సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ దక్కించుకోగా, లఖ్‌నవూ.. ఆర్పీఎస్జీ గ్రూప్‌నకు దక్కింది. సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ ₹5,625 కోట్లకు, ఆర్పీఎస్జీ గ్రూప్‌ 7,090 కోట్లతో ఈ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. రెండు కొత్త జట్ల ఫ్రాంఛైజీల కోసం బీసీసీఐ ఇటీవల బిడ్లు ఆహ్వానించింది. ఈ మేరకు బిడ్లు గెలిచిన రెండు ఫ్రాంఛైజీలను బీసీసీఐ ప్రకటించింది.

ఐపీఎల్‌- 2022లో బరిలో నిలిచే జట్లు ఇవే!

ఐపీఎల్‌-2022లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. వాటిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు ఉన్నాయి. తాజా వేలంలో కొత్తగా అహ్మదాబాద్‌, లఖ్‌నవూ జట్లు వచ్చి చేరాయి.

ఈ జట్లు ఇప్పుడు లేవు!

గత ఐపీఎల్‌ సీజన్స్‌లో కొన్ని జట్లు అలా వచ్చి వెళ్లిపోయాయి. వాటిలో దక్కన్‌ ఛార్జర్స్‌(2008-2012), కోచి టస్కర్స్‌(2011), పుణె వారియర్స్‌ (2011-2013), రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ (2016-2018), గుజరాత్‌ లయన్స్‌ (2016-2018) జట్లు ఆయా సీజన్స్‌లో ఆడి, ఆ తర్వాత రద్దయి పోయాయి.

Last Updated : Oct 25, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details