ఐపీఎల్లో సరికొత్త రికార్డు.. వికెట్ కోల్పోకుండా రెచ్చిపోయిన లఖ్‌నవూ - ఐపీఎల్ 2022 క్వింటన్ డికాక్ సరికొత్త రికార్డు
21:17 May 18
ఐపీఎల్లో సరికొత్త రికార్డు
IPL 2022 Kolkata vs lucknow: ఐపీఎల్ చరిత్రలోనే లఖ్‌నవూ సరికొత్త రికార్డు సృష్టించింది. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్ కోల్పోకుండా 20 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసింది. నిదానంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లఖ్‌నవూ భారీ స్కోరు సాధించింది. దీంతో కోల్‌కతాకు 211 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్: 10 ఫోర్లు, 10 సిక్సర్లు ) శతకంతో చెలరేగాడు. మరోవైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 68 నాటౌట్: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడు క్యాచ్‌లను వదిలేయడం కూడా లఖ్‌నవూకు కలిసొచ్చింది. వికెట్లను తీయడంలో కోల్‌కతా బౌలర్లు తేలిపోయారు. సీజన్ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.