IPL 2022 Mumbai Indians: ఐపీఎల్ 2022 మెగా టీ20 టోర్నీలో ఆదివారం దిల్లీతో తలపడిన తొలి మ్యాచ్‌లో ముంబయి ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 177 పరుగుల భారీ స్కోర్ సాధించినా ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయింది. దిల్లీ 18.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ముంబయి 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ ఓటమితో ముంబయి ఓ అనవసరపు రికార్డును సొంతం చేసుకుంది. వరుసగా పదో సీజన్‌లో ఇలా తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైన జట్టుగా నిలిచింది.
2009 నుంచి 2012 వరకు వరుసగా నాలుగేళ్లు తొలి మ్యాచ్‌లు గెలుపొందిన ఆ జట్టు తర్వాత.. 2013 నుంచి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా లీగ్ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచింది లేదు. అయితే, ఈ మధ్యకాలంలోనే ఎవరికీ వీలుకాని విధంగా ముంబయి ఐదుసార్లు ఛాంపియన్‌గా అవతరించింది. దీన్ని బట్టి ముంబయి టైటిల్ సాధించాలంటే తొలి మ్యాచ్ ఫలితంతో దానికి సంబంధమే లేదని అర్థమవుతోంది.