IPL 2022 MS DHONI: కెప్టెన్‌గా బాధ్యతలు వదిలేసిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ధోనీ సత్తాచాటాడు. ఈ పోరులో తనలోని బ్యాటర్‌ను తిరిగి బయటకు తీసి అజేయంగా 50 పరుగులు చేశాడు. దీంతో పెద్ద వయసులో ఐపీఎల్ అర్ధసెంచరీ సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 40 ఏళ్ల 262 రోజుల వయసులో అర్ధశతకం అందుకున్న ధోనీ.. రాహుల్ ద్రవిడ్ (40 ఏళ్ల 116 రోజులు)ను వెనక్కినెట్టాడు.
దాదాపుగా మూడేళ్లలో ధోనీకిదే తొలి అర్ధసెంచరీ. చివరగా అతను 2019, ఏప్రిల్ 21న అజేయంగా 84 పరుగులు చేశాడు. మొత్తంగా ఇది అతనికి 24వ అర్ధశతకం. ధోనీ ప్రదర్శనపై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో "తలా తిరిగొచ్చాడు" అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆల్‌టైమ్ దిగ్గజం ధోనీ అని కామెంట్లు చేస్తున్నారు.
బ్రావో రికార్డు: మరో చెన్నై జట్టు ఆటగాడు డ్వెేన్ బ్రావో కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో అత్యధిక వికెట్లు పడగొట్టిన లసిత్ మలింగ(170 వికెట్లు)ను సమం చేశాడు.