IPL 2022: ఐపీఎల్ అంటేనే అటు క్రీడాభిమానులకు, ఇటు ఆటగాళ్లకు భలే మజా. ఈ లీగ్‌లో ప్రతి ఫ్రాంచైజీ కప్ గెలవడానికే పరితపిస్తుంటుంది. అభిమానులు చాలా ఆసక్తిగా మ్యాచ్‌లను తిలకిస్తారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనా.. ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. అప్పటి నుంచి అభిమానులు ప్రతి ఏటా లీగ్ కోసం ఎదురుచూస్తుంటారు.
ఐపీఎల్ మొదలయ్యాక క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఆయా జట్ల అభిమానులు అనుసరిస్తున్నారు. తమ అభిప్రాయాల్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. దీంతో ఐపీఎల్ జట్లకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఫాలోవర్లు విపరీతంగా పెరిగారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లను అన్ని ఫ్రాంచైజీలు బాగా ఉపయోగిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
1. చెన్నై సూపర్ కింగ్స్
సీఎస్కే అంటే ధోని. ధోని అంటే సీఎస్కే. అత్యధిక సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరిన ఈ జట్టు నాలుగుసార్లు కప్పు గెలుచుకుంది. ధోని వెన్నెముకగా ఉన్న ఈ జట్టుకే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 31 మిలియన్ల మంది అభిమానులు ఈ జట్టును అనుసరిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ జట్టు ఫాలోవర్స్ ఇలా ఉన్నారు.
- ఫేస్బుక్- 13 మిలియన్లు
- ఇన్స్టాగ్రామ్- 9.6 మిలియన్లు
- ట్విట్టర్- 8.2 మిలియన్లు
- మొత్తం- 30.8 మిలియన్లు
2. ముంబయి ఇండియన్స్
ఐపీఎల్లో అత్యధిక సార్లు కప్పు గెలిచిన రికార్డు ఈ జట్టు సొంతం. ఇప్పటివరకు ఐదు సార్లు కప్పు కైవసం చేసుకుంది. మొదట్లో సచిన్ సారథ్యం వహించగా ఆ తర్వాత రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి జట్టు దాదాపు ప్రతిసారి ప్లే ఆఫ్ చేరుతోంది. సీఎస్కే తర్వాత ముంబయి ఇండియన్స్‌కే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వివరాలు..
- ఫేస్బుక్- 13 మిలియన్లు
- ఇన్స్టాగ్రామ్- 9 మిలియన్లు
- ట్విట్టర్- 7.3 మిలియన్లు
- మొత్తం- 29.3 మిలియన్లు
3. కోల్‌కతా నైట్‌రైడర్స్
ఇప్పటివరకు రెండుసార్లు ఐపీఎల్ కప్పు గెలుచుకున్న కోల్‌కతాకు సామాజిక మాధ్యమాల్లో 23.6 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.
- ఫేస్బుక్- 16 మిలియన్లు
- ఇన్స్టాగ్రామ్- 2.9 మిలియన్లు
- ట్విట్టర్- 4.7 మిలియన్లు
- మొత్తం- 23.6 మిలియన్లు
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అన్నీ బాగున్నా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పుగెలవని జట్టు ఆర్సీబీ. గత సీజన్ వరకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన ఈ జట్టుకు ఈ సీజన్ నుంచి కొత్త కెప్టెన్ రానున్నాడు. మూడుసార్లు ఫైనల్ వరకూ వెళ్లినా.. ఒక్కసారి కూడా కప్పును ముద్దాడలేకపోయింది ఈ ఫ్రాంచైజీ. ఈ జట్టుకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య ఇలా ఉంది..
- ఫేస్బుక్- 9.8 మిలియన్లు
- ఇన్స్టాగ్రామ్- 8.1 మిలియన్లు
- ట్విట్టర్- 5.5 మిలియన్లు
- మొత్తం- 23.4 మిలియన్లు
5. పంజాబ్ కింగ్స్