IPL 2022 Mega Auction: ప్రేక్షకుల్ని అలరించేందుకు ఐపీఎల్ 15వ సీజన్ సిద్ధమవుతోంది. ఈ ఏడాది మార్చి చివరి వారంలో ఈ లీగ్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు ఫిబ్రవరి 12, 13న మెగావేలం జరగనుంది. ఈసారి రెండు కొత్త జట్లు పాల్గొనబోతుండటం వల్ల ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. అలాగే ఈసారి వేలంలో పాల్గొనబోయే పూర్తి ఆటగాళ్ల జాబితా కూడా వచ్చేసింది. మొత్తం ఈ ఏడాది లీగ్ కోసం 1,214 మంది క్రికెటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ జట్లు ఎవరిని రిటైన్ చేసుకున్నాయి, ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత నగదు మిగిలి ఉందనే అంశాలను ఓసారి గమనిద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్
రవీంద్ర జడేజా - 16 కోట్లు
ధోనీ - 12 కోట్లు
మొయిన్ అలీ - 8 కోట్లు
రుతురాజ్ - 6 కోట్లు
ఈ రిటెన్షన్స్తో చెన్నై వద్ద ఇంకా రూ.48 కోట్ల నగదు మిగిలింది
సన్రైజర్స్ హైదరాబాద్
విలియమ్సన్ - 14 కోట్లు
అబ్దుల్ సమద్ - 4 కోట్లు
ఉమ్రన్ మాలిక్ - 4 కోట్లు
ఈ రిటెన్షన్స్తో ఇంకా సన్రైజర్స్ వద్ద రూ.68 కోట్లు మిగిలాయి.
పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్ - 14 కోట్లు
అర్షదీప్ సింగ్ - 4 కోట్లు
ఈ రిటెన్షన్స్తో పంజాబ్ వద్ద ఇంకా రూ.72 కోట్లు మిగిలాయి
ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ - 16 కోట్లు
బుమ్రా - 12 కోట్లు
సూర్యకుమార్ యాదవ్ - 8 కోట్లు
పొలార్డ్ - 6 కోట్లు
ఈ రిటెన్షన్స్తో ముంబయి వద్ద ఇంకా రూ.48 కోట్ల నగదు మిగిలింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ - 15 కోట్లు
మ్యాక్స్వెల్ - 11 కోట్లు
మహ్మద్ సిరాజ్ - 7 కోట్లు
ఈ రిటెన్షన్స్ పోగా ఆర్సీబీ వద్ద ఇంకా రూ.57 కోట్ల నగదు మిగిలింది