IPL 2022 Mega auction: ఐపీఎల్ మెగావేలం దిగ్విజయంగా ముగిసింది. రెండు రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన ఈ వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 67 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వీరి కోసం అన్నీ ఫ్రాంఛైజీలు కలిపి 5,51,70,00,000కోట్లు ఖర్చు చేశాయి. కాగా, ఈ వేలంలో ఇషాన్ కిషన్(రూ.15.25కోట్లు)అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత దీపక్ చాహర్(రూ.14కోట్లు, సీఎస్కే), శ్రేయస్ అయ్యర్(రూ.12.25కోట్లు, కోల్‌కతా) అత్యధిక ధర దక్కింది. ఇక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లలో అవేశ్ ఖాన్(రూ.10కోట్లు), షారుక్ ఖాన్లకు(రూ.9కోట్లు) భారీ ధర దక్కింది. మొత్తంగా ఈ ఆక్షన్‌లో ఏ జట్టు ఎవరెవరిని కొనుగోలు చేసంది, ఏ ప్లేయర్ ఎంతకు అమ్ముడుపోయారో ఆ వివరాలను తెలుసుకుందాం..
చెన్నై సూపర్ కింగ్స్ (25)
Chennai Super kings Players 2022: ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను అట్టిపెట్టుకుంది. మిగిలిన వారి కోసం రూ. 48 కోట్లతో మెగా వేలంలోకి వచ్చింది. అత్యధికంగా దీపక్ చాహర్ కోసం రూ. 14 కోట్లను ఖర్చుచేసింది. ఆ తర్వాత అంబటి రాయుడు రూ. 6.75 కోట్లు, డ్వేన్ బ్రావో (ఓవర్సీస్) రూ.4.40 కోట్లు, శివమ్ దూబే కోసం రూ. 4 కోట్లు వెచ్చించింది.
- క్రిస్ జొర్డాన్: రూ. 3.60 కోట్లు
- రాబిన్ ఉతప్ప : రూ. 2 కోట్లు
- మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్) : రూ.1.90 కోట్లు
- ఆడమ్ మిల్నే (ఓవర్సీస్) : రూ. 1.90 కోట్లు
- విక్రమ్ సోలంకి : రూ. 1.20 కోట్లు
- రాజ్‌వర్థన్: రూ.1.50 కోట్లు
- డేవన్ కాన్వే (ఓవర్సీస్) : రూ. కోటి
- మహీష్ తీక్షణ (ఓవర్సీస్) : రూ. 70 లక్షలు
- ప్రిటోరియస్ (ఓవర్సీస్) : రూ. 50 లక్షలు
- కేఎమ్ అసిఫ్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, శుభ్రాన్ష్ సేనాపతి, ముకేశ్ చౌధరి, జగదీశన్, హరి నిషాంత్ : రూ.20 లక్షలు
ముంబయి ఇండియన్స్ (25)
Mumbai indians Players 2022: ముంబయి ఇండియన్స్ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చింది. రోహిత్ శర్మ, బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ వంటి ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్న ముంబయి... ఇషాన్ కిషన్‌ను అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. ఇతడ ఈ సీజన్లోనే అత్యధిక ధర పలికాడు.
- ఇషాన్ కిషన్ : రూ. 15.25 కోట్లు
- టిమ్ డేవిడ్ (ఓవర్సీస్) : రూ. 8.25 కోట్లు
- జొఫ్రా ఆర్చర్ (ఓవర్సీస్) : రూ. 8 కోట్లు
- డేవిడ్ బ్రెవిస్ (ఓవర్సీస్) : రూ. 3 కోట్లు
- డేనియల్ సామ్స్ (ఓవర్సీస్) : రూ. 2.60 కోట్లు
- తిలక్ వర్మ : రూ. 1.70 కోట్లు
- మురుగన్ అశ్విన్ : రూ. 1.60 కోట్లు
- టైమల్ మిల్స్ (ఓవర్సీస్) : రూ. 1.50 కోట్లు
- జయ్‌దేవ్ ఉనద్కత్ : రూ. 1.30 కోట్లు
- రిలే మెరెడిత్ (ఓవర్సీస్) : రూ. కోటి
- ఫాబియన్ అలెన్ (ఓవర్సీస్) : రూ. 75 లక్షలు
- మయాంక్ మార్కండే : రూ. 65 లక్షలు
- సంజయ్ యాదవ్ : రూ. 50 లక్షలు
- బసిల్ థంపి: రూ. 30 లక్షలు
- అర్జున్ తెందూల్కర్: రూ. 30 లక్షలు
- ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ది, రమణ్ దీప్ సింగ్ : రూ. 20 లక్షలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (22)
Royal Challengers Bangalore Players 2022: ఈ సారి ఎలాగైనా ఐపీఎల్ కప్‌ను సాధించాలని ఆర్‌సీబీ చాలా నిశితంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌తో పాటు మహమ్మద్ సిరాజ్‌లను రిటెయిన్ చేసుకున్న ఆర్‌సీబీ వేలంలోనూ మరోసారి టాప్ ఆటగాళ్లనే కొనుగోలు చేసింది.
- వానిందు హసరంగ (ఓవర్సీస్) : రూ. 10.75 కోట్లు
- హర్షల్ పటేల్ : రూ . 10.75 కోట్లు
- డుప్లెసిస్ (ఓవర్సీస్) : రూ. 7 కోట్లు
- దినేశ్ కార్తీక్ : రూ. 5.5 కోట్లు
- జోష్ హేజిల్ వుడ్ (ఓవర్సీస్): రూ. 7.75 కోట్లు
- షాబాజ్ అహ్మద్ : రూ. 2.4 కోట్లు
- అనుజ్ రావత్ : రూ. 3.4 కోట్లు
- డేవిడ్ విల్లే (ఓవర్సీస్) : రూ. 2 కోట్లు
- షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (ఓవర్సీస్) : రూ. కోటి
- మహిపాల్ లామ్రోర్ : రూ. 95 లక్షలు
- ఫిన్ అలెన్ (ఓవర్సీస్) : రూ. 80 లక్షలు
- జేసన్ బెహ్‌రెండోర్ఫ్ (ఓవర్సీస్) : రూ. 75 లక్షలు
- సిద్ధార్థ్ కౌల్ : రూ. 75 లక్షలు
- కర్ణ్ శర్మ : రూ 50 లక్షలు
- చామ మిలింద్ : రూ. 25 లక్షలు
- సుయాశ్ ప్రభుదేశాయ్ : రూ. 30 లక్షలు
- ఆకాశ్ దీప్, అనీశ్వర్ గౌతమ్, లువ్‌నిత్ సిసోడియా : రూ. 20 లక్షలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (23)
Sunrisers Hyderabad Players 2022: కేన్ విలియమ్సన్‌తో పాటు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉమ్రాన్ మాలిక్, సమద్‌ను సన్‌రైజర్స్ రిటెయిన్ చేసుకుంది. వార్నర్, బెయిర్‌స్టో వంటి ఆటగాళ్లను వదిలేసుకుని మెగా వేలంలోకి వెళ్లింది. ఇంతకీ ఎవరెవరిని తీసుకుందంటే..
- వాషింగ్టన్ సుందర్ : రూ. 8.75 కోట్లు
- నికోలస్ పూరన్ (ఓవర్సీస్) : రూ. 10.75 కోట్లు
- భువనేశ్వర్ కుమార్ : రూ. 4.20 కోట్లు
- టి. నటరాజన్ : రూ. 4 కోట్లు
- ప్రియమ్ గార్గ్: రూ. 20 లక్షలు
- రాహుల్ త్రిపాఠి: రూ. 8.50 కోట్లు
- అభిషేక్ శర్మ : రూ. 6.50 కోట్లు
- విష్ణు వినోద్ : రూ. 50 లక్షలు
- కార్తిక్ త్యాగి: రూ. 4 కోట్లు
- శ్రేయస్ గోపా్: రూ. 75 లక్షలు
- జగదీశ సచిత్ : రూ. 20 లక్షలు
- మార్‌క్రమ్ (ఓవర్సీస్): రూ. 2.60 కోట్లు
- మార్కో జాన్‌సెన్ (ఓవర్సీస్) : రూ. 4.20 కోట్లు
- షెఫెర్డ్ (ఓవర్సీస్) : రూ. 7.75 కోట్లు
- ఫిలిప్స్ (ఓవర్సీస్) : రూ. 1.50 కోట్లు
- ఫరూఖి (ఓవర్సీస్) : రూ. 50 లక్షలు
- సమర్థ్ : రూ. 20 లక్షలు
- శశాంక్ సింగ్ : రూ. 20 లక్షలు
- సౌరభ్ దూబే : రూ. 20 లక్షలు
దిల్లీ క్యాపిటల్స్ (24)
Delhi capitals Players 2022: దిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్, ఆన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్, పృథ్వీషాను రిటెయిన్ చేసుకుంది. ఈ మెగా వేలం కోసం రూ. 47.5 కోట్లను ఖర్చు పెట్టింది. వార్నర్‌ను(రూ.6.25 కోట్లు) తీసుకుంది. శార్దూల్ ఠాకూర్ కోసం రూ. 10.75 కోట్లను వెచ్చించింది.
- మిచెల్ మార్ష్ (ఓవర్సీస్) : రూ. 6.50 కోట్లు
- సయ్యద్ ఖలీల్ అహ్మద్ : రూ. 5.25 కోట్లు
- చేతన్ సకారియా : రూ. 4.20 కోట్లు
- రోవ్‌మన్ పావెల్ (ఓవర్సీస్) : రూ. 2.80 కోట్లు
- ముస్తాఫిజర్ రెహ్మాన్ (ఓవర్సీస్) : రూ. 2 కోట్లు
- కుల్‌దీప్ యాదవ్ : రూ. 2 కోట్లు
- కేఎస్ భరత్ : రూ. 2 కోట్లు
- కమ్‌లేష్ నగర్‌కోటి : రూ. 1.10 కోట్లు
- మన్‌దీప్ సింగ్ : రూ. 1.10 కోట్లు
- లలిత్ యాదవ్: రూ. 65 లక్షలు
- టిమ్ సీఫెర్ట్ (ఓవర్సీస్) : రూ. 50 లక్షలు
- యాష్ ధుల్ : రూ. 50 లక్షలు
- ప్రదీప్ దూబే: రూ. 50 లక్షలు
- ఎంగిడి: రూ. 50 లక్షలు
- అశ్విన్ హెబ్బర్, సర్ఫరాజ్ ఖాన్, రిపల్ పటేల్, విక్కీ ఓత్సవాల్ : రూ. 20 లక్షలు