తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL Auction: తొలి రోజు ముగిసిన వేలం.. రికార్డ్ ధర ఎవరి కంటే? - ipl auction 2022 live

ipl-2022-mega-auction-live
ipl-2022-mega-auction-live

By

Published : Feb 12, 2022, 12:05 PM IST

Updated : Feb 12, 2022, 10:44 PM IST

21:46 February 12

తొలి రోజు ముగిసిన వేలం.. రికార్డ్ ధర ఎవరి కంటే?

తొలి రోజు ఐపీఎల్ వేలం ముగిసింది. ఇషాన్ కిషన్​ని ముంబయి ఇండియన్స్ రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర. దీపక్ చాహర్​ని రూ.14 కోట్లకు సీఎస్కే దక్కించుకుంది.

21:37 February 12

లఖ్​నవూకు అంకిత్ సింగ్ రాజ్​పుత్​

అంకిత్ సింగ్ రాజ్​పుత్​ను రూ.50లక్షలకు నఖ్​లవూ సొంతం చేసుకుంది. అతడి కనీస ధర రూ.20 లక్షలు.

మురుగన్ అశ్విన్​

మురుగన్​ అశ్విన్​ను రూ.1.6 కోట్లకు ముంబయి ఇండియన్స్​ సొంతం చేసుకుంది. అతడి కనీస ధర రూ.20 లక్షలు.

శ్రేయాస్​ గోపాల్ సన్​రైజర్స్​కు

శ్రేయాస్ గోపాల్​ని రూ.75 లక్షలకు సన్​రైజర్స్ సొంతం చేసుకుంది.

21:06 February 12

బౌలర్లలో కార్తిక్​ త్యాగీని రూ.4కోట్లు పెట్టి సన్​రైజర్స్​ హైదరాబాద్​ కొనుగోలు చేసింది. ఆల్​రౌండర్​ ఆకాశ్​ దీప్​ను రూ.20లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. బౌలర్​ కేఎమ్​ అసీఫ్ రూ.20లక్షలకు సీఎస్కే గూటికి చేరాడు. అవేశ్​ ఖాన్​కు రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. అతడిని లక్నో జెయింట్స్​ రూ.10కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడి ప్రారంభ ధర రూ.20లక్షలు.

20:48 February 12

వికెట్​కీపర్​/బ్యాటర్​

శ్రీకర్​ భరత్​.. రూ.20లక్షలు ప్రారంభ ధర.. రూ.2కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

విష్ణు సోలంకి, విష్ణు వినోద్​, మహ్మద్​ అజరుద్దీన్​- అన్​సోల్డ్​

అనుజ్​ రావత్​ను ఆర్సీబీ రూ.3.40కోట్లకు కొనుగోలు చేసింది

ప్రభ్​సిమ్రాన్​ సింగ్​ రూ.60లక్షల ధరకు పంజాబ్​ కింగ్స్​ గూటికి చేరాడు. ఎన్​ జగదీశన్​పై ఎవరు ఆసక్తి చూపలేదు. షెల్డన్​ జాక్సన్​ను రూ.60లక్షలకు కోల్​కతా నైట్​ రైడర్స్​ కొనుగోలు చేసింది. జితేశ్​ శర్మను పంజాబ్​ కింగ్స్​ బేసిక్​ ప్రైస్​ రూ.20లక్షలకు కొనుగోలు చేసింది. బాసిల్​ థంపిను ముంబయి ఇండియన్స్​ రూ.30లక్షలకు దక్కించుకుంది.

19:12 February 12

అన్​క్యాప్డ్​ ప్లేయర్లు..

  • రజత్​ పాటిదార్​- అన్​సోల్డ్​
  • ప్రియం గార్గ్​- రూ. 20 లక్షలు (సన్​రైజర్స్​)
  • అభినవ్​ సదరంగని- రూ. 2.6 కోట్లు (గుజరాత్​ టైటాన్స్​)

ముంబయికి అండర్​-19 సంచలనం జూనియర్​ ఏబీ..

అండర్​-19 వరల్డ్​కప్​లో ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​గా నిలిచిన డెవాల్డ్​ బ్రెవిస్​ను(సౌతాఫ్రికా) రూ. 3 కోట్లకు ముంబయి దక్కించుకుంది.

  • అశ్విన్​ హెబ్బర్​- రూ. 20 లక్షలు- దిల్లీ క్యాపిటల్స్​
  • అన్మోల్​ప్రీత్​ సింగ్​- అన్​సోల్డ్​

త్రిపాఠికి జాక్​పాట్​..

కోల్​కతా నైట్​రైడర్స్​ ప్లేయర్​ రాహుల్ త్రిపాఠిని రూ. 8.50 కోట్లకు సన్​రైజర్స్​ దక్కించుకుంది. గతేడాది ఇతడిని కోల్​కతా రూ. 60 లక్షలకే తీసుకుంది.

  • సి.హరి నిశాంత్​- అన్​సోల్డ్​ ​
  • రియాన్​ పరాగ్​- రూ. 3.8 కోట్లు, రాజస్థాన్​ రాయల్స్​
  • సర్భరాజ్​ ఖాన్​ - రూ. 20 లక్షలు- దిల్లీ క్యాపిటల్స్​

వేలానికి ముందు రీటెయిన్​ చేసుకోని ప్లేయర్​ అభిషేక్​ శర్మను తీసుకొనేందుకు మళ్లీ సన్​రైజర్స్​ రూ. 6.50 కోట్లు వెచ్చించింది.

స్టార్​ ఫినిషర్​ షారుక్​ ఖాన్​ను రూ. 9 కోట్లు భారీ ధరకు మళ్లీ పంజాబ్​ కింగ్స్​ దక్కించుకుంది.

శివం మావిని కోల్​కతా నైట్​రైడర్స్​ రూ. 7.25 కోట్లకు దక్కించుకుంది.

రూ.40లక్షల కనీస ధరతో బరిలో దిగిన రాహుల్ త్రిపాఠిని రూ.9 కోట్లకు గుజరాత్​ టైటాన్స్​ దక్కించుకుంది.

గుజరాత్​ టైటాన్స్​లోకి రాహుల్​ తెవాతియా

కమ్లేష్​ నాగర్​కోటిని 1.10కోట్లకు దిల్లీ క్యాపిటల్స్​ సొంతం చేసుకుంది. ఇతడి ప్రారంభ ధర రూ.40లక్షలు

హర్​ప్రీత్​ బ్రార్​ 3.80 కోట్లకు పంజాబ్​ కింగ్స్​ దక్కించుకుంది.

రూ.30లక్షల ప్రారంభ ధరతో వేలంలో దిగిన షాబాజ్​ అహ్మద్​ను ఆర్సీబీ 2.40కోట్లకు కొనుగోలు చేసింది.

18:20 February 12

స్పిన్నర్లలో కొందరు సూపర్​.. వారికి నిరాశ..

స్పిన్నర్ల లిస్ట్​లో యుజ్వేంద్ర చాహల్​ను రూ. 6.50 కోట్లకు రాజస్థాన్​ రాయల్స్​ దక్కించుకుంది. ఇతడి కోసం సన్​రైజర్స్​, ముంబయి తీవ్రంగా పోటీపడ్డాయి. చివర్లో వచ్చిన రాజస్థాన్​ అతడిని సొంతం చేసుకుంది.

  • ముంబయి స్పిన్నర్​ రాహుల్​ చాహర్​ను రూ. 5.25 కోట్లకు పంజాబ్​ కొనుగోలు చేసింది.
  • చైనామన్​ స్పిన్నర్​ కుల్​దీప్​ యాదవ్​ను రూ. 2 కోట్లకు దిల్లీ సొంతం చేసుకుంది.
  • అదిల్​ రషీద్​, ముజీబ్​ జద్రాన్​, ఇమ్రాన్​ తాహిర్, ఆడం జంపా, అమిత్​ మిశ్రా​ అన్​సోల్డ్​ ప్లేయర్లుగా మిగిలారు.

17:47 February 12

పేసర్లకు కాసులపంట..

ప్రస్తుత ఐపీఎల్​ వేలంలో పేసర్లపై కాసుల వర్షం కురిసింది.

  • శార్దుల్​ ఠాకుర్​ కోసం పలు ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అతడిని రూ. 10.75 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్​ దక్కించుకుంది.
  • కివీస్​ బౌలర్​ లాకీ ఫెర్గూసన్​ను రూ. 10 కోట్లకు గుజరాత్​ టైటాన్స్​ సొంతం చేసుకుంది.
  • అంతకుముందు ప్రసిద్ధ్​ కృష్ణను కూడా రూ. 10 కోట్లకు రాజస్థాన్​ రాయల్స్​ దక్కించుకుంది.
  • దీపక్​ చాహర్​ను రూ. 14 కోట్లకు మళ్లీ చెన్నై సూపర్​కింగ్స్​ చేజిక్కించుకుంది.
  • హేజిల్​వుడ్​ను రూ. 7.75 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.
  • మార్క్​ వుడ్​ను రూ. 7.5 కోట్లకు లఖ్​నవూ సొంతం చేసుకుంది.
  • భువనేశ్వర్​ కుమార్​ను సన్​రైజర్స్​ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది.
  • ముస్తాఫిజుర్​ రెహ్మాన్​ను రూ. 2 కోట్లకు దిల్లీ దక్కించుకుంది.

17:25 February 12

దీపక్​ చాహర్​కు కనకవర్షం..

టీమ్​ఇండియాలో ఆల్​రౌండర్​గా అదరగొడుతున్న దీపక్​ చాహర్​ జాక్​పాట్​ కొట్టాడు. అతడికి ఐపీఎల్​ వేలంలో రూ. 14 కోట్ల భారీ ధర దక్కింది. మొదట ఇతడి కోసం దిల్లీ, హైదరాబాద్​ పోటీపడగా.. అనంతరం చెన్నై, రాజస్థాన్​ మధ్య పోటీ నెలకొంది. చివరికి సొంతగూటికే చేరాడు.

17:23 February 12

పేసర్ల వేలం..

ప్రస్తుతం పేస్​బౌలర్ల వేలం కొనసాగుతోంది. నటరాజన్​ను రూ. 4 కోట్లకు సన్​రైజర్స్​ సొంతం చేసుకుంది.

16:58 February 12

నికోలస్​ పూరన్​కు జాక్​పాట్​..

విండీస్​ బ్యాటర్​ నికోలస్​ పూరన్​ కోసం కూడా ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. తొలినుంచి పోటీపడ్డ సన్​రైజర్స్​ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. కేకేఆర్​, సీఎస్​కే కూడా ఇతడి కోసం ఆసక్తి చూపాయి.

16:50 February 12

దినేష్​ కార్తిక్​- ఆర్సీబీ- రూ. 5.5 కోట్లు..

కోల్​కతా నైట్​రైడర్స్​ మాజీ కెప్టెన్​ దినేష్​ కార్తిక్​ను రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు.. రూ. 5.5 కోట్లకు దక్కించుకుంది.

వృద్ధిమాన్​ సాహా, సామ్​ బిల్లింగ్స్​.. అన్​సోల్డ్​ ప్లేయర్లుగా మిగిలారు.

16:42 February 12

బెయిర్​ స్టోను వదులుకున్న సన్​రైజర్స్​..

బెయిర్​ స్టోను పంజాబ్​ కింగ్స్​ రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది.

16:31 February 12

ఇషాన్​ కిషన్​కు రికార్డు ధర..

ఇషాన్​ కిషన్​ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఇతడి కోసం పంజాబ్​, గుజరాత్​, సన్​రైజర్స్​, ముంబయి పోటీ పడగా చివరగా రూ.15.25కోట్లు వెచ్చించి మళ్లీ ముంబయి ఇండియన్సే​ సొంతం చేసుకుంది.

ఇక సీనియర్​ ఆటగాడు అంబటి రాయుడును దక్కించుకునేందుకు సన్​రైజర్స్​ హైదరాబాద్​, చెన్నై సూపర్​ కింగ్స్​ పోటీ పడ్డాయి. చివరికి రూ.6.75 కోట్లు వెచ్చించి సీఎస్కే అతడిని సొంతం చేసుకుంది. గతేడాది ఇతడి ధర రూ.2.20కోట్లు. కాగా, అఫ్గానిస్థాన్​ ఆల్​రౌండర్​ మహ్మద్​ నబీని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.

16:13 February 12

మార్ష్​కు రూ. 6.5 కోట్లు..

మిచెల్​ మార్ష్​ను రూ. 6.5 కోట్లకు సొంతం చేసుకుంది దిల్లీ క్యాపిటల్స్​.

16:06 February 12

కృనాల్​ పాండ్య కోసం తీవ్ర పోటీ..

టీమ్​ఇండియా స్పిన్నర్​ కృనాల్​ పాండ్య కోసం సన్​రైజర్స్​, లఖ్​నవూ, గుజరాత్​ టైటాన్స్​ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ. 8.25 కోట్లకు లఖ్​నవూ అతడిని దక్కించుకుంది.

16:02 February 12

సన్​రైజర్స్​ బోణీ..

భారత స్పిన్నర్​ వాషింగ్టన్​ సుందర్​.. రూ. 8.75 కోట్లకు సన్​రైజర్స్​ సొంతమయ్యాడు.

15:47 February 12

లంక ఆల్​రౌండర్​ రికార్డు ధరకు..

లంక్​ ఆల్​రౌండర్​, గతేడాది ఆర్సీబీకి ఆడిన వనిందు హసరంగపై కోట్లు కుమ్మరించింది అదే ఫ్రాంఛైజీ. రూ. 10.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.

15:26 February 12

చారు శర్మ..

హ్యూజ్​ ఎడ్మీట్స్​ స్థానంలో చారు శర్మ.. వేలంపాటదారుడుగా వ్యవహరించనున్నట్లు ఐపీఎల్​ నిర్వాహకులు వెల్లడించారు. 3.45 గంటలకు వేలం కార్యక్రమం తిరిగి ప్రారంభంకానుంది.

14:40 February 12

కుప్పకూలిన వేలంపాట దారుడు..

ఐపీఎల్​ మెగా వేలంలో విరామం తీసుకున్నారు. రెండో సెట్​లో చివరి ఆటగాడైన వనిందు హసరంగ కోసం పంజాబ్​, హైదరాబాద్​ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా వేలం పాడే ఓ వ్యక్తి (ఆక్షనీర్​) స్టేజీపైనే కుప్పకూలాడు. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కాసేపు విరామం తీసుకోగా తిరిగి వేలాన్ని 3.30 గంటలకు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

14:11 February 12

ఐపీఎల్​ వేలంకు అంతరాయం..

ఐపీఎల్​ 2022 వేలంలో అపశ్రుతి నెలకొంది. వేలం పాడే వ్యక్తి (ఆక్షనీర్​) హ్యూజ్​ ఎడ్మీడ్స్​ ఒక్కసారిగా స్టేజీపైనే కుప్పకూలాడు. వనిందు హసరంగ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

14:02 February 12

హుడాకు రూ. 5.75 కోట్లు..

టీమ్​ ఇండియాకు ఇటీవలే అరంగేట్రం చేసిన.. దీపక్​ హుడా ఐపీఎల్​ వేలంలో భారీ ధర పలికాడు. రూ. 5.75 కోట్లకు లఖ్​నవూ గూటికి చేరాడు.

13:54 February 12

గతేడాది పర్పుల్​ క్యాప్​- ఈసారి సూపర్​హిట్​..

గత సీజన్​ పర్పుల్​ క్యాప్​ హోల్డర్​, ఆర్సీబీ బౌలర్​ హర్షల్​ పటేల్​ కోసం ఫ్రాంఛైజీలు భారీగా పోటీపడ్డాయి. చివరకు మళ్లీ ఆర్సీబీనే రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది.

13:50 February 12

హోల్డర్​కు బంపర్​ ఆఫర్​..

విండీస్​ ఆల్​రౌండర్​ జేసన్​ హోల్డర్​ను.. లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ రూ. 8.75 కోట్లకు దక్కించుకుంది.

13:40 February 12

బ్రావో మళ్లీ చెన్నైకే..

యువ ఆటగాడు నితీశ్​ రాణాను మళ్లీ కేకేఆర్​ కొనుగోలు చేసింది. గతేడాది ఇతడి ధర రూ. 3.40 కోట్లుగా ఉంటే.. ఇప్పుడు రూ. 8 కోట్లు పెట్టింది.

వెస్టిండీస్ మాజీ​ ఆల్​రౌండర్​ డ్వేన్​ బ్రావోను మళ్లీ చెన్నై సూపర్​ కింగ్స్​ తీసుకుంది. దిల్లీ కూడా ఇతడి కోసం పోటిపడింది. చివరకు రూ. 4.40 కోట్లకు సీఎస్​కే సొంతం చేసుకుంది.

13:32 February 12

వావ్​ పడిక్కల్​..

ఆర్సీబీ ఆటగాడు, యువ ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​ కోసం ఆయా జట్లు పోటీపడ్డాయి. చివరకు రూ. 7.75 కోట్లకు రాజస్థాన్​ రాయల్స్​ దక్కించుకుంది.

13:28 February 12

హెట్​మయర్​ పంట పండింది..

దిల్లీ ప్లేయర్​ హెట్​మయర్​ ఈసారి రాజస్థాన్​ రాయల్స్​కు ఆడనున్నాడు. అతడిని రూ. 8.5 కోట్లకు సొంతం చేసుకుంది.

రాబిన్​ ఊతప్పను రూ. 2 కోట్ల కనీస ధరకే సొంతం చేసుకుంది పాత జట్టు చెన్నై సూపర్​ కింగ్స్​.

జేసన్​ రాయ్​ను రూ. 2 కోట్ల కనీస ధరకే దక్కించుకుంది గుజరాత్​ టైటాన్స్​.

మిల్లర్​ అన్​సోల్డ్​..

పంజాబ్​ మాజీ ఆటగాడు డేవిడ్​ మిల్లర్​పై తొలి రౌండ్​లో ఏ జట్టూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.

13:21 February 12

మనీష్​ పాండేకు రూ. 4.6 కోట్లు..

సన్​రైజర్స్​ హైదరాబాద్​ రీటెయిన్​ చేసుకోని భారత ప్లేయర్​ మనీష్​ పాండేను రూ. 4.6 కోట్లకు లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ దక్కించుకుంది.

12:58 February 12

ఇప్పటివరకు ఎవరెవరు ఎంతంటే?

ఐపీఎల్​ 2022 వేలం జరుగుతోంది. ఇప్పటివరకు భారత యువఆటగాడు, దిల్లీ క్యాపిటల్స్​ మాజీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు.

అతడిని రూ. 12.25 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​. మోర్గాన్​ను రీటెయిన్​ చేసుకోనందున రానున్న సీజన్​లో కేకేఆర్​ ఇతడినే కెప్టెన్​గా నియమించే అవకాశముంది.

చాలా మంది కోట్లు పలకగా.. వార్నర్​, అశ్విన్​లను కాస్త తక్కువకే సొంతం చేసుకున్నాయి ఆయా ఫ్రాంఛైజీలు.

ఇంకా ఎవరెవరు ఎంతకంటే?

  • కగిసో రబాడ - రూ. 9.25 కోట్లు- పంజాబ్ కింగ్స్​
  • శిఖర్ ధావన్- రూ. 8.25 కోట్లు- పంజాబ్ కింగ్స్​
  • న్యూజిలాండ్​ బౌలర్​ బౌల్ట్​- రూ. 8కోట్లు- రాజస్థాన్
  • ప్యాట్ కమిన్స్​​- రూ.7.25 కోట్లు- కోల్​కతా
  • డుప్లెసిస్​- రూ.7 కోట్లు- బెంగళూరు
  • డికాక్​- రూ. 6.75 కోట్లు- లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​
  • మహ్మద్​ షమి- రూ. 6.25 కోట్లు- గుజరాత్​ టైటాన్స్​

12:53 February 12

దిల్లీకి వార్నర్​- తక్కువ ధరకే..

ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్​ వార్నర్​.. ఊహించిన ధర కంటే తక్కువకే అమ్ముడుపోయాడు. అతడిని దిల్లీ క్యాపిటల్స్​ రూ. 6.25 కోట్లకు సొంతం చేసుకుంది.

కొన్ని సీజన్లుగా సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు వార్నర్​. గత సీజన్​లో ఫామ్​ లేని కారణంగా కెప్టెన్​గా తప్పించడమే కాకుండా కొన్ని మ్యాచ్​లకు కూడా వార్నర్​ను దూరంగా ఉంచింది ఎస్​ఆర్​హెచ్​.

12:50 February 12

డికాక్​కు రూ. 6.75 కోట్లు..

క్వింటన్​ డికాక్​ ముంబయి చేజారాడు. అతడిని రూ. 6.75 కోట్లకు పోటీపడి దక్కించుకుంది లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​. పాత జట్టు ముంబయి ఇండియన్స్​, దిల్లీ కూడా ఇతడి కోసం పోటీపడ్డాయి.

12:43 February 12

డుప్లెసిస్​కు రూ. 7 కోట్లు..

చెన్నె సూపర్​కింగ్స్​ జట్టు మాజీ ప్లేయర్​ డుప్లెసిస్​ను.. రూ . 7 కోట్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు దక్కించుకుంది.

12:42 February 12

షమి రూ. 6.25 కోట్లు..

భారత పేసర్​ మహ్మద్​ షమీని రూ. 6.25 కోట్లకు దక్కించుకుంది గుజరాత్​ టైటాన్స్​

12:35 February 12

శ్రేయస్​కు రికార్డు ధర..

దిల్లీ క్యాపిటల్స్​ ప్లేయర్​ శ్రేయస్​ అయ్యర్​.. రూ. 12.25 కోట్ల రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. అతడి కోసం దిల్లీ మళ్లీ పోటీపడినా.. కోల్​కతా నైట్​రైడర్స్​ అతడిని సొంతం చేసుకుంది.

కోల్​కతా ఈసారి ఇతడినే కెప్టెన్​గా చేసే అవకాశముంది. మోర్గాన్​ రీటెయిన్​ చేసుకోనందున ఇతడికి ఎక్కువ అవకాశాలున్నాయి.

12:32 February 12

బౌల్ట్​కు రూ. 8 కోట్లు..

రాజస్థాన్​ రాయల్స్​ జట్టు బౌల్ట్​ను రూ. 8 కోట్లకు చేజిక్కించుకుంది. ముంబయి మళ్లీ ఇతడి కోసం పోటీపడినా.. చివర్లో వద్దనుకుంది.

12:26 February 12

పంజాబ్​కు రబాడ..

దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు కాగిసో రబాడను పంజాబ్​ కింగ్స్​ భారీ ధరకు చేజిక్కించుకుంది.

అతడిని రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది.

12:21 February 12

కమిన్స్​ కోసం పోటాపోటీ..

ఆస్ట్రేలియా పేసర్​ ప్యాట్​ కమిన్స్​కు ఐపీఎల్​ వేలంలో భారీ ధర దక్కింది. రూ. 7.25 కోట్లకు అతడిని మళ్లీ కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టే సొంతం చేసుకుంది. ఈ ప్లేయర్ల కనీస ధర రూ. 2 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

12:18 February 12

అశ్విన్​కు రూ. 5 కోట్లు..

దిల్లీ మాజీ ప్లేయర్​, భారత స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ను.. రాజస్థాన్​ రాయల్స్​ రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది.

12:06 February 12

ధావన్​ కోసం హోరాహోరీ..

భారత ఓపెనర్​, దిల్లీ క్యాపిటల్స్​ మాజీ ప్లేయర్​ శిఖర్​ ధావన్​ కోసం ఫ్రాంఛైజీలు హోరాహోరీ తలపడ్డాయి.

అతడిని రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్​ కింగ్స్​.

12:01 February 12

IPL 2022 Auction: ఐపీఎల్​ మెగా వేలం షురూ..

IPL 2022 Auction: అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ బెంగళూరు వేదికగా ప్రారంభమైంది. శనివారం, ఆదివారం.. రెండు రోజులు ఈ వేలం జరగనుంది.

మొత్తం పది ఫ్రాంచైజీలు ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను రిటెయిన్/సెలెక్షన్‌ చేసుకున్నాయి. ఇక దాదాపు 590 మంది క్రికెటర్ల నుంచి తమకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం అన్ని ఫ్రాంచైజీలు దాదాపు రూ.560 కోట్లకుపైగా సొమ్మును ఖర్చు చేయనున్నాయి. అత్యధికంగా పంజాబ్‌ కింగ్స్‌ వద్ద రూ.72 కోట్లు ఉండగా.. దిల్లీ క్యాపిటల్స్‌ వద్ద తక్కువగా రూ.47.5 కోట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు గరిష్ఠంగా 25 ఆటగాళ్లను కలిగి ఉండాలి. కొన్ని ఫ్రాంచైజీలు ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని రిటెయిన్‌ చేసుకోగా.. మిగిలిన వారిని వేలంలో దక్కించుకుంటాయి.

Last Updated : Feb 12, 2022, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details