IPL 2022 Mega auction Ishan kishan: ఇషాన్ కిషన్ 2022 ఐపీఎల్ వేలంలో అదరగొట్టాడు. ఇప్పటివరకు అత్యధిక మొత్తం అతడికే దక్కింది. రూ. 15.25 కోట్లకు ముంబయి ఇండియన్స్ జట్టు అతడిని సొంతం చేసుకుంది. గత కొన్ని సీజన్లలో ఈ జట్టుకే ఆడినప్పటికీ.. ఇటీవల ముంబయి కిషన్‌ను రీటెయిన్ చేసుకోలేదు.
వేలంలో తొలుత పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ పోటీపడ్డాయి. తర్వాత గుజరాత్- ముంబయి మధ్య పోటీ జరిగింది. ఆఖర్లో అనూహ్యంగా హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. అయినా ఎక్కడా తగ్గని ముంబయి అతడిని దక్కించుకుంది. గతేడాది ఇతడి ధర రూ. 6.20 కోట్లు కాగా.. ప్రస్తుతం రెట్టింపు కంటే ఎక్కువ పలకడం విశేషం.
నాలుగో ప్లేయర్..
ఈ క్రమంలో.. ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి వేలంలో అత్యధిక మొత్తం పలికిన నాలుగో ఆటగాడిగా, రెండో భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ జాబితాలో మోరిస్ నెంబర్‌వన్‌గా ఉన్నాడు. అతడిపై గతేడాది రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 16.25 కోట్లు పెట్టింది.
యువరాజ్ సింగ్ రూ. 16 కోట్లతో( 2015, దిల్లీ డేర్‌డెవిల్స్) రెండో స్థానంలో ఉన్నాడు.
లిస్ట్‌లో ఎవరెవరు?
- క్రిస్ మోరిస్ - రూ. 16.25 కోట్లు - 2021 (రాజస్థాన్ రాయల్స్)
- యువరాజ్ సింగ్ - రూ. 16 కోట్లు - 2015 (దిల్లీ డేర్‌డెవిల్స్)
- ప్యాట్ కమిన్స్ - రూ. 15.50 కోట్లు - 2020 (కోల్‌కతా నైట్‌రైడర్స్)
- ఇషాన్ కిషన్ - రూ. 15.25 కోట్లు - 2022 (ముంబయి ఇండియన్స్)
- కైల్ జేమిసన్ - రూ. 15 కోట్లు - 2021 (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
ఇదీ చూడండి:IPL 2022 Mega Auction: హర్షల్ పటేల్ రికార్డు.. రైనాకు షాక్