IPL 2022: ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానున్న నేపథ్యంలో రెండు కొత్త జట్లకు అధికారిక అనుమతులు ఇచ్చింది భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). మంగళవారం ఐపీఎల్ పాలక మండలి సమావేశం అనంతరం లఖ్‌నవూ, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఫార్మల్ క్లియరన్స్ ఇచ్చినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తెలిపారు. మెగా వేలానికి ముందే రెండు జట్లు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించాలని జట్లకు తెలిపినట్లు పేర్కొన్నారు.
కాగా, ఐపీఎల్ మెగావేలం తేదీ కూడా ఖరారైనట్లు బ్రిజేశ్ స్పష్టం చేశారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
టైటిల్ స్పాన్సర్‌గా టాటా గ్రూప్స్..