IPL 2022 Mega Auction: ఫిబ్రవరి 12-13 తేదీల్లో జరిగే ఐపీఎల్ మెగావేలం కోసం క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ ఆటగాడిని ఏ ఫ్రాంఛైజీ ఎంత ధరకు కొనుగోలు చేస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓ ప్లేయర్ 'మ్యాచ్ విన్నర్' అని భావిస్తే అతడిని ఎన్ని రూ.కోట్లు పెట్టి అయినా సొంతం చేసుకోవాలని భావిస్తుంటాయి ఫ్రాంఛైజీలు. అయితే రూ.కోట్లు కుమ్మరించినా.. జట్టు టైటిల్ నెగ్గడంలో ఏమాత్రం ప్రభావంచూపని క్రికెటర్లూ ఉన్నారు.
కానీ, ఐపీఎల్ వేలం చరిత్రలో ఓ ఆటగాడిపై రూ.10 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు. అయినప్పటికీ అత్యంత విజయవంతమైన జట్లుగా అవి కొనసాగుతుండటం విశేషం. ఇప్పటివరకు రోహిత్ కెప్టెన్సీలో ముంబయి ఐదు టైటిళ్లు గెలవగా, ధోనీ సారథ్యంలో చెన్నై నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.