తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPl 2022: లఖ్​నవూ ఫ్రాంచైజీ పేరు ఇదేనా!

Lucknow Franchise trending names: ఐపీఎల్​లో కొత్త ఫ్రాంచైజీగా బరిలో దిగుతోన్న లఖ్​నవూ.. జట్టు కోసం పేరును ఖరారు చేసే పనిలో పడింది. అందుకోసం పలు పేర్లను ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. ఇందులోంచి ఓ పేరును త్వరలోనే ప్రకటించనున్నారు.

Lucknow Franchise name, లఖ్​నవూ ఫ్రాంచైజీ పేరు
Lucknow Franchise

By

Published : Jan 8, 2022, 12:12 PM IST

Lucknow Franchise trending names: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లఖ్​నవూ జోరు మీదుంది. ఇప్పటికే కోచ్, మెంటార్​తో పాటు అసిస్టెంట్ కోచ్​ పేర్లను ప్రకటించిన యాజమాన్యం.. ఇప్పుడు జట్టు పేరు ఖరారు చేసే పనిలో పడింది. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో కొన్ని సూచనలు కోరింది. దీంతో పలువురు ఫ్రాంచైజీకి పేరు సూచిస్తూ ట్వీట్లు చేశారు. ఇందులో కొన్ని పేర్లు యాజమాన్యం దృష్టికి వచ్చినట్లు సమాచారం.

టాప్​లో ఈ పేర్లు!

లఖ్​నవూ నవాబ్స్, లఖ్​నవూ బ్రేవ్ హర్ట్స్, రైజింగ్ లఖ్​నవూ జాయింట్స్, లఖ్​నవూ గ్లాడియేటర్స్, లఖ్​నవూ కింగ్స్, లఖ్​నవూ స్టీలర్స్, లఖ్​నవూ బేర్స్.

లఖ్​నవూ కోచ్​గా ఆండీ.. మెంటార్​గా గంభీర్

Andy Flower Lucknow Franchise: జింబాబ్వే జట్టు మాజీ సారథి ఆండీ ఫ్లవర్​.. లఖ్​నవూ జట్టు హెడ్​కోచ్​గా నియమితులయ్యాడు. ఆండీ ఫ్లవర్​ అంతకుముందు పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్​ కోచ్​గా చేశాడు. అలాగే అసిస్టెంట్ కోచ్​గా విజయ్ దహియా నియామకాన్ని ఖరారు చేశారు. ఇక ఈ ఫ్రాంచైజీకి మెంటార్​గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్​ను నియమించింది యాజమాన్యం.

2022 IPL Teams: 2022 ఐపీఎల్ సీజన్​లో ఈ సారి 10జట్లు పోటీపడనున్నాయి. లఖ్​నవూ, అహ్మదాబాద్​ జట్లు తొలిసారిగా ఐపీఎల్​ బరిలోకి దిగనున్నాయి. లఖ్​నవూ ఐపీఎల్ జట్టును ఆర్​పీఎస్​జీ గ్రూప్​ కొనుగోలు చేసింది.

ఇవీ చూడండి: కోహ్లీపై వ్యంగ్యాస్త్రాలు.. ఓ వెబ్​సైట్​కు జాఫర్ కౌంటర్

ABOUT THE AUTHOR

...view details