Liam livingstone longest six: ఈ ఐపీఎల్ భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ఓ రికార్డు సాధించాడు. ఈ సీజన్లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాది(వరుసగా 6,6,6,4,2,4) 28 పరుగులు సాధించాడు.
లివింగ్‌స్టోన్ విధ్వంసం.. ఈ సీజన్లోనే భారీ సిక్సర్ - లియామ్ లివింగ్‌స్టోన్ లాంగెస్ట్ సిక్స్ 117 మీటర్లు
Liam livingstone longest six: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ ఓవర్‌లోనే తొలి బంతికి 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా లివింగ్‌స్టోన్ నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు ముంబయి ఇండియన్స్ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ 112 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇదీ చూడండి: IPL 2022: గుజరాత్ జోరుకు బ్రేక్.. పంజాబ్ ఘన విజయం