IPL 2022 KKR VS RCB: ముంబయి డీవై పాటిల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌటయ్యారు. ప్రత్యర్థి జట్టుకు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆండ్రీ రసెల్(25; 1x4,3x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
IPL 2022: రెచ్చిపోయిన హసరంగ.. చేతులెత్తేసిన కోల్‌కతా - kolkatta night riders
IPL 2022 KKR VS RCB: ఐపీఎల్ 2022లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. ప్రత్యర్థి జట్టును 128 పరుగులకే కట్టడి చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా బ్యాటర్లు.. ఆర్సీబీ బౌలర్ల విజృంభణకు తట్టుకోలేకపోయారు. ఓపెనర్లు అజింక్య రహనే(9), వెంకటేశ్ అయ్యర్(10) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(13) పరుగులు చేసి హసరంగ బంతికి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన నితీశ్ రానా(10), సునీల్ నరైన్(12), సామ్ బిల్లింగ్స్(14) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో కోల్‌కతా సగం ఓవర్లకే సగానికి పైగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక, వికెట్ కీపర్ జాక్స్‌న్(0).. హసరంగ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్(25) తప్ప మిగతా ఆటగాళ్లందరూ నిరాశపరిచారు. ఆఖర్లో వచ్చిన ఉమేశ్ యాదవ్(18) కాస్త ఆడినా.. ఆకాశ్ దీప్ తన బంతితో పెవిలియన్‌కు పంపేశాడు. చివరికి వరుణ్ చక్రవర్తి(10) నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా 18.5 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌటయ్యారు. బెంగళూరు బౌలర్లు హసరంగ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ 1 వికెట్లు తీశారు.
ఇదీ చదవండి: వినూ మన్కడ్ కుమారుడు, మాజీ క్రికెటర్ కన్నుమూత