IPL 2022 Highest Runs: ఐపీఎల్ అంటేనే ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద. మ్యాచ్ తొలి బంతి నుంచి చివరి బంతి వరకు.. ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు.. ప్రతీ ఆటగాడు బంతిని బౌండరీ లైన్ దాటించాలని ఆరాటపడతాడు. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా బ్యాటర్లు వారి పరుగుల దాహం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ లీగ్‌లో కొందరు బ్యాటర్లు ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడి భారీ పరుగులు సాధించారు. ఈసారి కూడా ప్లేయర్స్ ఇలాంటి ఇన్నింగ్స్నే ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ఎవరు? ఎన్ని పరుగులు చేశారు? వంటి వివరాలను ఓ సారి పరిశీలిద్దాం..
విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మాజీ సారథి విరాట్ కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2013 నుంచి 2021 వరకు సారథ్యం వహించాడు. బ్యాటర్‌గా రాణించినా జట్టును ఒకసారి కూడా విజయతీరాలకు చేర్చలేకపోయాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కోహ్లీ మిగతా ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు 199 ఇన్నింగ్స్ ఆడి 37.39 సగటుతో 6283 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, 42 అర్ధ శతకాలు ఉన్నాయి.
శిఖర్ ధావన్
తన విధ్వంసకర బ్యాటింగ్‌తో గబ్బర్‌గా పేరుతెచ్చుకున్నాడు శిఖర్ ధావన్. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధావన్.. ఐపీఎల్‌లోనూ సత్తాచాటుతున్నాడు. ఇప్పటివరకు 5,197 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ