IPL 2022 Hardik pandya: తాము నాకౌట్ దశకు చేరుకునే సరికి అదృష్టం కలిసిరాదేమోననే భయం కలుగుతోందని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆందోళన వ్యక్తం చేశాడు. గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ చివరి బంతికి సిక్సర్‌తో విజయం సాధించింది. రాహుల్ తెవాతియా (41*), రషీద్ ఖాన్ (31) చెలరేగడం వల్ల ఉత్కంఠభరితమైన క్షణాల్లో విజయం సాధించింది. అంతకుముందు కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన గుజరాత్.. దానికన్నా ముందు చెన్నైతో ఆడిన మ్యాచ్‌లోనూ చివరి క్షణాల్లో గెలుపొందింది. దీంతో తాము నాకౌట్ దశకు చేరుకొనే సరికి అదృష్టం కలిసిరాదేమోనని పాండ్య గతరాత్రి మ్యాచ్ అనంతరం సరదాగా అన్నాడు.
ఐపీఎల్.. నాకు చాలా భయమేస్తోంది: హార్దిక్ - ఐపీఎల్ 2022 లైవ్ అప్డేట్స్
IPL 2022 Hardik pandy: తాము నాకౌట్ దశకు చేరుకొనే సరికి అదృష్టం కలిసిరాదేమోనని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆందోళన వ్యక్తం చేశాడు. ఏదేమైనప్పటికీ తమ ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని చెప్పుకొచ్చాడు.
"డ్రెస్సింగ్ రూమ్‌లో నేనెప్పుడూ ఇలా జోక్ చేస్తుంటా. 'మీరంతా మంచి ఆటగాళ్లు. మీరు గెలవడానికి సాయం చేస్తాను' అని దేవుడు నాతో చెప్తుంటాడని చెబుతా. ఎందుకంటే తరచూ ఇలాగే జరుగుతోంది. దీంతో మేం నాకౌట్ చేరుకొనే సరికి ఆ అదృష్టం కలిసిరాదేమోనని భయమేస్తోంది. మా జట్టులో ఎప్పుడూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆటగాళ్లకు సరైన మద్దతు లభిస్తుందా లేదా అనేది తరచూ చూసుకుంటాం. ఇక నేను బౌలింగ్ చేయాలా వద్దా అనేది పూర్తిగా జట్టు అవసరాలను బట్టి ఉంటుంది. ఇది సుదీర్ఘమైన టోర్నీ కాబట్టి ఇప్పుడే తొందరపడి బౌలింగ్ చేయాలని లేదు. మేమెంతో ప్రాక్టికల్‌గా ఉంటాం. మా ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు" అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: ఉమ్రాన్ మాలిక్ కొత్త రికార్డు.. ఆ ప్లేయర్‌పై మురళీధరన్ ఫైర్!