IPL 2022 Rashid khan record: ఐపీఎల్ 2022లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది. అయితే ఈ విజయంలో నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ రికార్డు సాధించాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 27 మ్యాచుల్లో 40 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. సందీప్ లమిచ్చానే(23 మ్యాచులు, 38 వికెట్లు), డ్వేన్ బ్రావో(19, 34), జాసన్ హోల్డర్(17, 29) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక రషీద్.. ఈ మ్యాచ్ ద్వారా తన ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. 3.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. అంతకుముందు 2020 ఐపీఎల్ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై(3 వికెట్లు/ 7 పరుగులు), పంజాబ్ కింగ్స్‌పై(3 వికెట్లు/12 పరుగులు) చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 వికెట్లు తీశాడు. దీంతో పాటే ఐపీఎల్లో అతి తక్కువ వయసులో 100 వికెట్లు తీసిన యంగెస్ట్ బౌలర్ నిలిచిన రషీద్ మరో అరుధైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 450 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచి.. దిగ్గజాలు డ్వేన్ బ్రావో(వెస్టిండీస్), ఇమ్రాన్ తాహీర్(దక్షిణాఫ్రికా) సరసన చేరాడు.