తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: కోల్​కతా జట్టులోకి ఆసీస్ స్టార్... ఆ ఓపెనర్​ స్థానంలో.. - ఆరోన్ ఫించ్

IPL 2022: ఈ ఐపీఎల్​ సీజన్ కోసం ఆస్ట్రేలియా స్టార్​​ ఆరోన్​ ఫించ్​ను జట్టులోకి తీసుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​. ఇంగ్లాండ్​ ఆటగాడు అలెక్స్​ హేల్స్​ తప్పుకోవడం వల్ల ఈ మేరకు అతడిని ఎంపిక చేసుకుంది.

Aaron Finch
ఆరోన్​ ఫించ్

By

Published : Mar 11, 2022, 11:10 PM IST

IPL 2022: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్​ ఆరోన్​ ఫించ్​ను జట్టులోకి తీసుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​. ఇంగ్లాండ్​ ఓపెనర్ అలెక్స్​ హేల్స్​ స్థానంలో ఫించ్​ను భర్తీ చేసింది.​ బయోబబుల్​లో​ ఇమడలేక ఈ సీజన్​ నుంచి తప్పుకొన్నాడు హేల్స్​. కాగా, గత నెలలో జరిగిన మెగావేలంలో అన్​సోల్డ్​గానే మిగిలాడు ఫించ్​. అతడిని కొనడానికి ఏ జట్టూ ఆసక్తి చూపలేదు.

87 ఐపీఎల్​ మ్యాచులాడిన ఫించ్​ 2వేలకు పైగా పరుగులు సాధించాడు. కేకేఆర్ యాజమాన్యం అతడిని రూ.1.5కోట్ల బేస్ ప్రైజ్​కు సొంతం చేసుకుంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరోన్ ఫించ్ నాయకత్వం వహించాడు. 88 టీ20 మ్యాచులాడిన ఫించ్​ 2,686 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 15 అర్ధ శతకాలు ఉన్నాయి.

ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్​ ఫించ్​ చివరిసారిగా 2020లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్​ తొలి మ్యాచ్​లో కోల్​కతా.. డిఫెండింగ్​ ఛాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​తో తలపడనుంది.

ఇదీ చదవండి:Lasith Malinga: ఐపీఎల్​లో బౌలింగ్ ​కోచ్​గా మలింగ.. ఏ జట్టుకంటే?

ABOUT THE AUTHOR

...view details