IPL 2022 Delhi CapitalsMarsh injured: దిల్లీ క్యాపిటల్స్‌కు సీజన్ ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగలనుంది. ఆ జట్టు సభ్యుడు మిచెల్ మార్ష్ ఐపీఎల్లో ఆడేది అనుమానంగా మారింది. మంగళవారం నుంచి పాకిస్థాన్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ చేస్తుండగా మార్ష్‌కు గాయమైంది. దీంతో అతడు సిరీస్ నుంచి పూర్తిగా వైదొలగగా.. ఐపీఎల్లో ఆడేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగావేలంలో మార్ష్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకుంది.
దిల్లీ ప్రధాన ఆల్‌రౌండర్‌కు గాయం.. ఐపీఎల్ నుంచి ఔట్? - దిల్లీ క్యాపిటల్స్ న్యూస్
IPL 2022 Delhi CapitalsMarsh injured: దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ ఐపీఎల్లో పాల్గొనేది ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్థాన్‌తో సిరీస్ నేపథ్యంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. దీంతో ఈ మెగా టోర్నీకి అతడు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది.
mitchell marsh news
30 ఏళ్ల మిచెల్ మార్ష్.. ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. గతేడాది ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36.88 సగటుతో 627 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి:IPL 2022: ముంబయిపై ఘనవిజయం సాధించిన దిల్లీ