IPL 2022 Deepak chahar: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త! గాయం కారణంగా ఈ మెగాలీగ్కు దూరమైన స్టార్ బౌలర్ దీపక్ చాహర్ తిరిగి జట్టులోకి రానున్నాడని తెలుస్తోంది. ముందుగా చెప్పినట్లుగా అతడికి సర్జరీ అవసరం లేదని, సీజన్ మొదలయ్యాక కొన్ని రోజులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగావేలంలో చెన్నై జట్టు భారీ ధర రూ.14కోట్లకు దీపక్ చాహర్‌ను దక్కించుకుంది. వేలంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా అతడు నిలిచాడు.
కాగా, వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అతడు తొడ కండరాల గాయానికి గురికావడం వల్ల ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి.
అంతర్జాతీయ కెరీర్లో చాహర్ 20 టీ20లు ఆడి 26 వికెట్లు పడగొట్టగా.. 7 వన్డేల్లో 10 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటిన చాహర్.. వన్డేల్లో రెండు అర్థశతకాలు సాధించాడు. ఐపీఎల్లో 63 మ్యాచులు ఆడి 59 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ నెల 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి:Gujarat Titans: జేసన్ రాయ్ స్థానంలో ఆ ఓపెనర్!