IPL 2022 Warner Chahal: ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం జరిగిన దిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో దిల్లీ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవం చేసుకుంది. అయితే వార్నర్ అదృష్టం రాజస్థాన్ రాయల్స్ కొంపముంచినట్లయింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్ చాహల్ బౌలింగ్ చేశాడు. అతడు వేసిన బంతి.. వార్నర్ బ్యాట్‌ను దాటి ఆఫ్‌స్టంప్‌ను తాకుతూ వెళ్లిపోయింది. దీంతో వికెట్ దక్కిందనుకున్న చాహల్ ఆనందం అంతలోనే ఆవిరైంది. బంతి నెమ్మదిగా తాకడంతో లైట్స్ వెలిగినా... బెయిల్ మాత్రం పడలేదు. దాంతో వార్నర్ నాటౌట్‌గా తేలాడు. ఒకవేళ ఆ బెయిల్ కిందపడి వార్నర్ ఔట్ అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేది. అప్పటికి వార్నర్ 22 పరుగులు మాత్రమే చేశాడు. మార్ష్ దాటిగా ఆడుతున్నప్పటికి.. మంచి భాగస్వామ్యం ఏర్పడిన దశలో వార్నర్ ఔట్ అయ్యుంటే రాజస్థాన్‌కు కలిసొచ్చేదే. కానీ విజయం దిల్లీకే రాసిపెట్టినట్లైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చాహల్ రికార్డు.. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడినప్పటికీ.. చాహల్ ఓ ఫీట్‌ను అందుకున్నాడు. ఒక సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో చాహల్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 23 వికెట్ల తీశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ తరపున ఇదే అత్యుత్తమం. ఇక తొలి స్థానంలో జేమ్స్ ఫాల్కనర్ ఉన్నాడు. 2013లో ఫాల్కనర్ 28 వికెట్లతో దుమ్మురేపాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు మరో రెండు మ్యాచ్‌లు సహా ఆ తర్వాత ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. కాబట్టి చాహల్ ఫాల్కనర్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక సోహైల్ తన్వీర్(2008, 22 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. జోఫ్రా ఆర్చర్(2020, 20 వికెట్లు), శ్రేయస్ గోపాల్(2019, 20 వికెట్లు) సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు.