తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ X గుజరాత్​: రెండో విజయం ఎవరిని వరించెనో? - ipl upcoming matches

IPL 2022 DC VS GT: తమ తొలి మ్యాచ్​ల్లోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించి విజయాలు సాధించిన దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్​ టైటాన్స్​ జట్లు నేడు (శనివారం) జరగబోయే మ్యాచ్​లో తలపడనున్నాయి. ఇరు జట్లు రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను తెలుసుకుందాం..

IPL 2022 DC VS GT
IPL 2022 DC VS GT

By

Published : Apr 2, 2022, 10:31 AM IST

IPL 2022 DC VS GT: ఐపీఎల్​ 2022 సీజన్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తమ తొలి మ్యాచ్​ల్లో ప్రత్యర్థులను ఓడించిన దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్​ టైటాన్స్​ జట్లు నేడు రెండో మ్యాచ్​లో (శనివారం) తలపడేందుకు సిద్ధమయ్యాయి. రాత్రి 7.30 గంటలకు ఎంసీఏ వేదికగా మ్యాచ్​ జరగనుంది. ఇక ఇందు​లో గెలిచి.. రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని రెండు జట్లు ఆరాటపడుతున్నాయి. గెలిచిన జట్టు టాప్​లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిద్దాం.

జోరుమీద ఉన్న దిల్లీ: లీగ్​లో అత్యధిక సార్లు టైటిల్​ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్​ జట్టును తొలి మ్యాచ్​లోనే ఓడించిన దిల్లీ క్యాపిటల్స్ జోరుమీద ఉంది. క్వారంటైన్​ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు లుంగి ఎంగిడి, ముస్తాఫిజుర్​ రెహ్మాన్​, సర్ఫరాజ్​ ఖాన్​ జట్టులో చేరనున్నారు. దీంతో జట్టుకు అదనపు బలం చేకూరనుందని చెప్పొచ్చు. గత మ్యాచ్​లో శుభారంభం అందించిన ఓపెనింగ్​ జోడీ పృథ్వీషా, టిమ్​ సీఫెర్ట్​ ఈసారి కూడా రాణించాలని యాజమాన్యం కోరుకుంటోంది. మన్​దీప్​, రిషభ్​ పంత్​, పావెల్​ గత మ్యాచ్​లో నిరాశపరిచారు. దిల్లీ క్యాపిటల్స్​ భారీ మొత్తం వెచ్చించిన శార్దుల్​ ఠాకూర్ కాస్త​ ఫర్వాలేదనిపించాడు. లీగ్​లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలంటే బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.

ఆత్మవిశ్వాసంతో గుజరాత్​:ఈ ఏడాది లీగ్​లో కొత్తగా చేరిన గుజరాత్​ టైటాన్స్​ జట్టు అరంగేట్ర మ్యాచ్​లో మరో కొత్త జట్టు లఖ్​నవూపై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే బలంగా ఉన్న దిల్లీ క్యాపిటల్స్​పై గెలవడం అంత సులభం కాదని చెప్పొచ్చు. లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో టాప్​ ఆర్డర్​ బ్యాటర్లు శుభమన్​ గిల్​, విజయ్​శంకర్​ నిరాశపరిచారు. మాథ్యూ వేడ్​ ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్​ హార్దిక్​ పాండ్య, రాహుల్​ తెవాటియా, మిల్లర్​, అభినవ్​ మనోహర్​ రాణించడం సానుకూలాంశం. మరి ఈ మ్యాచ్​లో ఎవరు నెగ్గుతారో చూడాలి.

ఇదీ చదవండి:'ధోనీని చాలా రోజుల తర్వాత కలిశా.. సంతోషంగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details