తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నర్​ రికార్డు.. ధోనీ, కోహ్లీని వెనక్కినెట్టి రోహిత్​ సరసన - రోహిత్ వార్నర్​ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు

IPL 2022 SRH VS DC warner record: సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ ప్లేయర్​ డేవిడ్​ వార్నర్​ ఓ రికార్డును సాధించాడు. చెన్నై సారథి ధోనీ, ఆర్సీబీ మాజీ కెప్టెన్​ కోహ్లీని వెనక్కినెట్టి ముంబయి సారథి రోహిత్​ సరసన చేరాడు.

warner player of the match award
వార్నర్​ ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

By

Published : May 6, 2022, 9:34 AM IST

Updated : May 6, 2022, 9:41 AM IST

Rohithsharam Warner player of the match record: సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్​లో 92* పరుగులతో అజేయంగా నిలిచిన అతడు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డును అందుకున్నాడు. ఈ మెగాలీగ్​ చరిత్రలో అతడు 18వ సారి దీన్ని ముద్దాడాడు. దీంతో ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మ రికార్డును సమం చేశాడు. హిట్​మ్యాన్​కు కూడా ఇప్పటివరకు 18 ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డులు వరించాయి. దీంతో ఈ పురస్కారాన్ని అత్యధిక సార్లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో వార్నర్​ కూడా మూడో స్థానానికి చేరుకున్నాడు.

కాగా, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్(25)​ ఎక్కువ సార్లు ఈ అవార్డును అందుకున్న ప్లేయర్​గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత యూనివర్సల్​ బాస్​ క్రిస్​గేల్​(22), ధోనీ(17), కోహ్లీ(13) రెండు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఇక ఈ మ్యాచ్​లో దిల్లీ విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్​రైజర్స్​ 186/8 పరుగులు చేసింది. పూరన్(62) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే అతడికి మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్​రైజర్స్​.. వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది.

ఇదీ చూడండి: SRH VS DC: ఆ జాబితాలో అగ్రస్థానంలోకి వార్నర్​.. ఉమ్రాన్​ @157

Last Updated : May 6, 2022, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details