తెలంగాణ

telangana

ETV Bharat / sports

CSK VS RCB: ధోనీని ఊరిస్తున్న రికార్డులివే!

IPL 2022 CSK VS RCB Dhoni: ఐపీఎల్​లో భాగంగా నేడు(బుధవారం) చెన్నై సూపర్​ కింగ్స్​-రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో సీఎస్కే కెప్టెన్​ ధోనీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో చూద్దాం...

IPL 2022 CSK VS RCB Dhoni
ఐపీఎల్ 2022 ధోనీ

By

Published : May 4, 2022, 11:02 AM IST

IPL 2022 CSK VS RCB Dhoni: టీ20 మెగా టోర్నీలో చెన్నై సారథిగా తిరిగి పగ్గాలు అందుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీ తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్నాడు. గత ఆదివారం పుణె వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా, నేడు సాయంత్రం ఇదే వేదికపై బెంగళూరుతో ధోనీ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ మహీ ముందు పలు వ్యక్తిగత రికార్డులు ఉన్నాయి. మరి వాటిని మిస్టర్‌ కూల్‌ అందుకోగలడా..?

ధోనీ ముందున్న రికార్డులివే..

  • టీ20 మెగా టోర్నీలో ధోనీకిది 200వ మ్యాచ్‌. ఈ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు 200 మ్యాచ్‌లు ఆడుతున్న రెండో ఆటగాడు ఇతడే. బెంగళూరు తరఫున కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. గత సీజన్‌లోనే 200వ మ్యాచ్‌ ఆడిన కోహ్లీ.. టీ20 మెగా లీగ్‌ టోర్నీలో ఇప్పటివరకు 217 మ్యాచ్‌లు ఆడాడు. 2016, 2017లో చెన్నై జట్టు టోర్నీకి దూరమవడంతో ధోనీ 30 మ్యాచ్‌లు పుణె తరఫున ఆడాల్సి వచ్చింది.
  • ఇక టీ20 కెప్టెన్‌గా ధోనీకి ఇది 302వ మ్యాచ్‌. టీ20ల్లో ఇప్పటివరకు సారథిగా 5994 పరుగులు సాధించిన ధోనీ.. మరో 6 పరుగులు చేస్తే 6వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అంతేగాక, కెప్టెన్‌గా టీ20ల్లో భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. 6451 పరుగులతో కోహ్లీ ఈ జాబితాలో ముందున్నాడు.
  • టీ20 మోగా టోర్నీలో బెంగళూరుపై ధోనీ ఇప్పటివరకు 836 పరుగులు చేశాడు. ఇందులో 46 సిక్స్‌లు ఉన్నాయి. మరో నాలుగు సిక్స్‌లు కొడితే ఈ మెగా టోర్నీలో ఒక జట్టుపై 50 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు.

ఇదీ చూడండి: లివింగ్​స్టోన్​ విధ్వంసం.. ఈ సీజన్​లోనే భారీ సిక్సర్​

ABOUT THE AUTHOR

...view details