తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నై నుంచి కీలక ఆటగాళ్లు ఔట్​.. జట్టులోకి జూనియర్​ 'మలింగ'!

IPL 2022 CSK: ముంబయి ఇండియన్స్​తో మ్యాచ్​కు ముందు చెన్నై సూపర్​ కింగ్స్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దీపక్​ చాహర్​ దూరం కాగా.. మరో పేసర్​ టోర్నీ నుంచి వైదొలిగాడు. మరోవైపు.. ఓపెనింగ్​ బ్యాటర్​ సైతం జట్టును వీడాడు. దీంతో జూనియర్​ మలింగను తమ స్క్వాడ్​లోకి తీసుకుంటున్నట్లు సీఎస్​కే ప్రకటించింది.

IPL csk
చెన్నై నుంచి కీలక ఆటగాళ్లు ఔట్​

By

Published : Apr 21, 2022, 5:00 PM IST

IPL 2022 CSK: ఐపీఎల్​ మెగా టీ20 లీగ్​ 15వ సీజన్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఆడిన 6 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముంబయి ఇండియన్స్​తో గురువారం జరిగే మ్యాచ్​కు ముందు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో సీఎస్​కే పేసర్​ అడమ్​ మిల్నే మోకాలికి గాయమైంది. గాయం తీవ్రమవటం వల్ల ఈ సీజన్​ మొత్తానికి దూరమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అడమ్​ మిల్నే

మిల్నే స్థానంలో జూనియర్​ 'మలింగ': గాయం కారణంగా జట్టుకు దూరమైన అడమ్​ మిల్నే స్థానంలో జూనియర్​ మలింగగా పేరున్న శ్రీలంక యువ పేసర్ మథీశ పథిరాణాను జట్టులోకి తీసుకుంటున్నట్లు సీఎస్​కే ప్రకటించింది. ఈ 19 ఏళ్ల మీడియం పేసర్​ 2020, 2022లో జరిగిన అండర్​ 19 ప్రపంచకప్​లో శ్రీలంక తరఫున ఆడి మంచి ప్రదర్శన చేశాడు. రూ.20 లక్షల బేస్​ ప్రైజ్​తో జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఈ ఐపీఎల్​ సీజన్​లో దీపక్​ చాహర్​ తర్వాత సీఎస్​కే నుంచి అడమ్​ మిల్నే టోర్నీకి దూరమయ్యాడు. మిల్నే కేవలం ఒకే మ్యాచ్​ ఆడి 2.3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చాడు. వికెట్లేమీ తీయలేదు. తొలి మ్యాచ్​ తర్వాత మాట్లాడిన సీఎస్​కే కోచ్​ స్టిఫెన్​ ఫ్లెమింగ్​.. మిల్నే త్వరగా కోలుకుని జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ, టోర్నీ మొత్తానికి దూరం కావటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి.

పెళ్లి కోసం స్వదేశానికి సీఎస్​కే బ్యాటర్​:చెన్నై సూపర్​ కింగ్స్​ ఓపెనర్​ డెవాన్​ కాన్వే ఐపీఎల్​ను వీడాడు. తన వివాహం కోసం భారత్​ను వీడి దక్షిణాఫ్రికా చేరుకున్నాడు. మరోవారం పాటు ఐపీఎల్​కు దూరం కానున్నాడని సీఎస్​కే వర్గాలు తెలిపాయి. అయితే.. కాన్వే ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్​ ఆడాడు. దీంతో అతడి సేవలను జట్టు అంతగా కోల్పోకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాన్వే ఏప్రిల్​ 24(ఆదివారం) సీఎస్​కే స్క్వాడ్​లో చేరతాడని సమాచారం. అయినప్పటికీ కొవిడ్​-19 ప్రోటోకాల్స్​ ప్రకారం మూడు రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సీఎస్​కే క్యాంప్​లో చేరాలి. దీంతో వచ్చే రెండు మ్యాచ్​లకు దూరం కానున్నాడు.

డెవాన్​ కాన్వే

ఇదీ చూడండి:'కెప్టెన్​గా తప్పుకుంటానని ధోనీ.. నాకు ముందే చెప్పాడు'

ఐపీఎల్​లో కరోనా కలకలం.. మళ్లీ '2021' భయం!

ABOUT THE AUTHOR

...view details