IPL 2022 Chetan Sakaria: ఐపీఎల్ 2021లో అరంగ్రేటం చేసిన యువ పేసర్ చేతన్ సకారియా తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతడు 14 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు. ఇక, ఈ ఏడాది మెగా వేలంలో అతడిని దిల్లీ క్యాపిటల్స్ రూ. 4.2 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌లో ధోనీని క్లీన్ బౌల్డ్ చేసిన చేతన్.. ఈ ఏడాది విరాట్ కోహ్లీ వికెట్ తీయడమే తన టార్గెట్ అని తెలిపాడు.
"ఐపీఎల్ 2021 సీజన్‌లో ధోనీ వికెట్ తీయడం నా బెస్ట్ మూమెంట్. పంజాబ్ కింగ్స్‌తో నేను ఆడిన నా మొదటి ఐపీఎల్ మ్యాచ్ కూడా చాలా స్పెషలే. ధోనీని క్లీన్ బౌల్డ్ చేయడం చాలా అద్భుతమైన ఫీలింగ్. నెట్స్‌లో నేను ఏబీ డివిలియర్స్‌కు కూడా బౌలింగ్ చేశాను. ఏబీడీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఆయన అన్ని రకాల షాట్స్ ఆడగలరు. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు. కాబట్టి ఏబీని ఔట్ చేయాలనే నా కల తీరదు. అందుకే నా నెక్ట్స్ టార్గెట్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ భాయ్ వికెట్ తీయడమే నా ముందున్న లక్ష్యం."