తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: కొత్త జట్ల కనీస ధర పెంపు.. బోర్డుకు కాసుల వర్షమే! - ఐపీఎల్ 2022 వేలం

వచ్చే ఐపీఎల్​ సీజన్​లో 10 జట్లు(ipl 2022 new teams) ఖాయమని ఇటీవలే బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పేశారు. ఇక ఆ రెండు జట్లతో బోర్డుకు భారీ ఆదాయం సమకూరనుందని తెలుస్తోంది. ఈసారి కొత్త ఫ్రాంచైజీలు రికార్డు ధర పలుకుతాయని చెప్పారు ఓ బీసీసీఐ అధికారి.

IPL 2022
ఐపీఎల్

By

Published : Aug 31, 2021, 3:21 PM IST

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌. ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్‌ను 10 జట్ల(ipl 2022 new teams)కు పెంచాలని ఎప్పట్నుంచో భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చింది బోర్డు. 8 జట్లతో ఈ సీజనే చివరిదని వచ్చే సీజన్​లో 10 జట్లు(2022 ipl 10 teams) పాల్గొంటాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్​ చెప్పేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైందని తెలుస్తోంది. అయితే ఈ కొత్త ఫ్రాంచైజీల ధరలు చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే.

"ఏ కంపెనీ అయినా రూ. 10 లక్షలు చెల్లించి బిడ్ దాఖలు చేయొచ్చు. అయితే ఆ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 3 వేల కోట్ల వరకు ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి. ఇంతకుముందు ఫ్రాంచైజీ కనీస ధర (బేస్ ప్రైస్​) రూ.1700 కోట్లుగా అనుకున్నాం. కానీ దానిని రూ.2 వేల కోట్లకు మార్చాలని ఇటీవలే నిర్ణయించాం. ఇప్పటికే కొత్త ఫ్రాంచైజీల కోసం చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రెండు జట్లకు కలిపి కనీసం రూ.5 వేల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నాం. 14వ సీజన్​లో మొత్తంగా 74 మ్యాచ్​లు జరగనున్నాయి."

-ఓ బీసీసీఐ అధికారి

కొత్త ఫ్రాంచైజీల రేసు(ipl 2022 new teams)లో అహ్మదాబాద్, లఖ్​నవూ, పుణె ముందు వరుసలో ఉన్నాయి. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం, లఖ్​నవూలోని ఏకనా స్టేడియాలు భారీ సామర్థ్యంతో కూడుకున్నవి. దీంతో ఈ రెండు పట్టణాల పేర్లు కొత్త ఫ్రాంచైజీలకు అనువుగా ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికొస్తే అదానీ, ఆర్​పీజీ సంజీవ్ గోయంక గ్రూప్, టొరెంట్ ఫార్మాతో పాటు మరికొన్ని సంస్థలు బిడ్​ దాఖలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తోంది.

ఇవీ చూడండి: తాలిబన్లపై పాక్​ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్​!

ABOUT THE AUTHOR

...view details