IPL Funny Banners: ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. మరో మూడు మ్యాచ్‌లతో టోర్నీ విజేత ఎవరో తెలిసిపోతుంది. అయితే ఈ ఏడాది అభిమానులు ఐపీఎల్లో బాగా సందడి చేశారు. తమ అభిమాన జట్లను ఉత్తేజపరిచేందుకు స్టేడియాలకు భారీగా తరలివచ్చారు. ఈక్రమంలో కొందరు అరుపులు, కేకలు, ఈలలలో సందడి చేస్తే.. మరికొందరు ఫన్నీ బ్యానర్లు ప్రదర్శించారు. అందులో కొన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. అవి ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు పాండ్య అర్ధసెంచరీ చేస్తే ఉద్యోగం వదిలేస్తా..:ఏప్రిల్ 11న ముంబయి వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పటికి బ్యాటింగ్‌లో ఫామ్‌లో లేని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను ఉద్దేశించి ఓ అభిమాని బ్యానర్ ప్రదర్శించాడు. పాండ్య అర్ధ సెంచరీ చేస్తే తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ప్లకార్డుపై రాశాడు. పాండ్య కచ్చితంగా 50 కొట్టడు అనుకున్న అభిమానికి గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో పాండ్య హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ మ్యాచ్ మాత్రం సన్‌రైజర్స్ గెలిచింది. మ్యాచ్ అనంతరం ఈ బ్యానర్‌పై తెగ మీవ్స్ వచ్చాయి. ఆ అభిమానిని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. రాజీనామా చేశావా? అని కామెంట్లు పెట్టారు. మరి బ్యానర్ ప్రదర్శించిన అభిమాని రాజీనామా చేశాడో లేదో తెలియదు.
ఐపీఎల్లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు విరాట్ సెంచరీ చేసే వరకు నేను డేటింగ్ చేయను:విరాట్ కోహ్లీ అభిమానులు అతను సెంచరీ చేస్తాడని రెండేళ్లుగా కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో 71వ శతకం నమోదు చేసి తమ ఆకలి తీర్చుతాడని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్లో ఓ అభిమాని ఫన్నీ బ్యానర్ ప్రదర్శించాడు. విరాట్ 71వ సెంచరీ చేసే వరకు తాను డేటింగ్ చేయనని రాసుకొచ్చాడు.
ఐపీఎల్లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు ఆర్సీబీ కప్పు గెలిచేవరకు పెళ్లి చేసుకోను: ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా ఆర్సీబీకి అనేక మంది అభిమానులున్నారు. మహిళలు కూడా ఆ జట్టును ఎక్కువ ఇష్టపడతారు. ఆర్సీబీ, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో ఓ లేడీ.. తమ అభిమాన జట్టు కప్పు గెలిచేవరకు తాను పెళ్లి చేసుకోబోనని ప్లకార్డు ప్రదర్శించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్సీబీ ఈసారి కాస్త లక్కుతో ప్లే ఆఫ్స్‌కు చేరింది. బుధవారం జరిగే మ్యాచ్లో లఖ్‌నవూతో తలపడునుంది. గెలిస్తే క్వాలిఫయర్ 2లో రాజస్థాన్‌ను ఎదుర్కొంటుంది. లేదంటే ఇంటిబాట పడుతుంది. మరి ఈ లేడీ ఫ్యాన్ పెళ్లి కోసమైనా.. ఆర్సీబీ ఈసారి కప్పు గెలుస్తుందేమో చూడాలి.
ఐపీఎల్లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు కెమెరామెన్ ఇటువైపు కూడా చూడు: మ్యాచ్ సమయంలో కెమెరామెన్ ఎప్పుడూ అందమైన అమ్మాయిలనే చూపిస్తుంటారు. లేదా ఆసక్తి గల సన్నివేశాలు, బ్యానర్లను కవర్ చేస్తుంటారు. అయితే మమ్మల్ని కూడా కాస్త కవర్ చెయ్ అంటూ ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌లోనే ఓ అభిమాని ప్రదర్శించిన బ్యానర్ నవ్వులు పూయించింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్లో ధోని ఏదో చెబుతున్నప్పుడు నాన్‌స్ట్రయికర్ పట్టించుకోడు. దీంతో ధోని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇదే ఫొటోను ప్లకార్డుపై ప్రదర్శించి కెమెరామెన్ అబ్బాయిల వైపు కూడా చూడాలని అర్థం వచ్చేలా ఓ అభిమాని రాసుకొచ్చాడు.
ఐపీఎల్లో అభిమానుల ఫన్నీ బ్యానర్లు గర్ల్‌ఫ్రెండ్ కన్నా మ్యాచే ముఖ్యం:క్రికెట్ అభిమానులకు గర్ల్‌ఫ్రెండ్స్‌తో మ్యాచ్‌లు కూడా చాలా ముఖ్యం. అయితే ఓ అభిమానికి వింత పరిస్థితి ఎదురైంది. ఐపీఎల్ కావాలో తాను కావాలో తేల్చుకోలాని అతని గర్ల్‌ఫ్రెండ్ షరతు పెట్టిందట. దీంతో అతను మ్యాచే ముఖ్యమని స్డేడియానికి వచ్చాడట. 'నేను కావాలా ఐపీఎల్ కావాలా తేల్చుకోమని నా గర్ల్‌ఫ్రెండ్ అడిగింది. అందుకు సమాధానంగా నేను మ్యాచ్ చూడటానికే వచ్చా' అని అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు అందరి దృష్టినీ ఆకర్షించింది. సన్రైజైర్స్ హదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి:IPL eliminator 2022: బెంగళూరు లక్కా.. లఖ్‌నవూ మ్యాజిక్కా..?