IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌లో తేలిపోయింది. రాజస్థాన్‌కు భారీగా పరుగులు సమర్పించుకుంది. తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. రాజస్థాన్‌కు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. హైదారాబాద్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (55) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు.. దేవ్‌దత్ పడిక్కల్ (41) రాణించాడు. ఓపెనర్లు జోస్ బట్లర్ (35), యశస్వీ జైస్వాల్ (20) రాజస్థాన్‌కి శుభారంభం అందించారు. ఆఖర్లో వచ్చిన షిమ్రోన్ హెట్‌మైర్ (32) బౌండరీలతో అలరించాడు. రియాన్ పరాగ్ (12) ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. నాథన్ కౌల్టర్‌నైల్ (1) నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ రెండేసి, భువనేశ్వర్ కుమార్, రొమెరియో షెఫర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.
సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్ ముంగిట భారీ లక్ష్యం - సన్‌రైజర్స్ ఐపీఎల్ న్యూస్
IPL 2022: సన్‌రైజర్స్, రాజస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. హైదరాబాద్ జట్టు ముందు రాజస్థాన్ 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ipl sunrisers first innings
ఈ మ్యాచ్‌లో.. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్, సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్ కీలక మైలురాళ్లను చేరుకున్నారు. శాంసన్‌కు ఇది వందో మ్యాచ్ కాగా, నటరాజన్‌కు ఇది 50వ టీ20 మ్యాచ్.
Last Updated : Mar 29, 2022, 9:37 PM IST