Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైపోయాయి. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి గేమ్‌లో రాణించి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
IPL 2022 5th match: భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన నికోలస్ పూరన్, సారథి కేన్ విలియమ్సన్.. సన్‌రైజర్స్‌కు మూలస్తంభాలుగా నిలవనున్నారు. ఇక ఎప్పటిలాగే ఆ జట్టు బౌలింగ్ విభాగం మెరుగ్గా ఉంది. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్, యార్కర్ కింగ్ నటరాజన్, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌లపై సన్‌రైజర్స్ ఆధారపడనుంది. వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ గోపాల్ సైతం కీలకంగా మారనున్నారు.