Deepak Chahar: ఐపీఎల్ 2022లో అధిక భాగానికి దీపక్ చాహర్ అందుబాటులో ఉండకపోవడం చెన్నై సూపర్‌కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ! గత నెల వెస్టిండీస్‌తో చివరిదైన మూడో టీ20లో బౌలింగ్ సందర్భంగా అతడి కుడి తొడ కండరానికి గాయమైంది. దీంతో ప్రస్తుత శ్రీలంక సిరీస్‌కూ దూరమయ్యాడు చాహర్. అయితే అతడు ఐపీఎల్ పూర్తి సీజన్‌కూ అందుబాటులో ఉండకపోవచ్చని తాజా సమాచారం.
ఐపీఎల్ మెగావేలంలో రూ.14 కోట్లు పెట్టి చాహర్‌ను తిరిగి దక్కించుకుంది సీఎస్కే. దీంతో ఇషాన్ కిషన్ (ముంబయి ఇండియన్స్-రూ.14.25 కోట్లు) తర్వాత వేలంలో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా అతడు నిలిచాడు. బహుముఖ ప్రజ్ఞావంతుడైన చాహర్ సేవలు లభించకపోవడం కచ్చితంగా చెన్నైకి నష్టమే!
చెన్నై ప్రధాన అస్త్రం అతడు!
గతేడాది చెన్నై తన నాలుగో ఐపీఎల్ టైటిల్ గెలవడంలోనూ దీపక్ చాహర్ కీలకపాత్ర పోషించాడు. కొత్త బంతితో పవర్‌ప్లేలో వికెట్ తీయగల నైపుణ్యం అతడి సొంతం. ప్రత్యర్థి టాప్ ఆర్డర్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చడం, కీలక సమయాల్లో బ్యాట్ ఝుళిపించడం అతడి ప్రత్యేకత. అందుకే చాహర్ స్థానాన్ని భర్తీ చేయడం చెన్నైకి సవాలుగా మారింది.
చాహర్ కాకుండా సీఎస్కేలో డ్వేన్‌బ్రావో, క్రిస్ జోర్డాన్, ఆడం మిల్నే, తుషార్ దేశ్‌పాండే, కేఎం అసిఫ్, సిమర్జీత్ సింగ్, ముకేశ్ చౌదరి, రాజ్వర్ధన్ హంగార్గేకర్ లాంటి పేసర్లు ఉన్నారు. శివం దుబే, డ్వేన్ ప్రిటోరియస్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు.
చాహర్ గనుక పూర్తి సీజన్‌కు దూరమైతే అతడి స్థానంలో వేరొక ప్లేయర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాట్‌తోనూ రాణించగల పేసర్ లభించడం కష్టమే అయినా ఈ కింది ముగ్గురిని అతడి స్థానంలో తీసుకునే అవకాశముంది.