IPL 2022 Audience: ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే కొవిడ్ 19 ప్రోటోకాల్ అనుసరించి 25 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. మార్చి 26న వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో సీజన్ ఆరంభం కానుంది. "అభిమానులను తిరిగి క్రికెట్‌ను ఆస్వాదించేందుకు మైదానంలోకి ఆహ్వానించేందుకు 15వ సీజన్ ఎడిషన్ సిద్ధమైంది. చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు స్వాగతం పలకనున్నాం" అని బీసీసీఐ పేర్కొంది.
IPL 2022: ప్రేక్షకులకు అనుమతి.. కానీ! - ఐపీఎల్ అభిమానులు
IPL 2022 Audience: ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను మైదానాలకు స్వాగతం పలుకుతున్నామని బీసీసీఐ తెలిపింది. ఈ నెల 26న ప్రారంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్‌కు 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.
IPL 2022: మార్చి 26 నుంచి మే 29 వరకు దాదాపు రెండు నెలలపాటు ఐపీఎల్ 15వ సీజన్ అలరించనుంది. ముంబయి, పుణెలోని నాలుగు మైదానాల్లో మాత్రమే పోటీలు జరుగుతాయి. కొవిడ్ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత కోసం దూర ప్రయాణాలు లేకుండా ఈ మేరకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో ఇరవై.. బ్రాబోర్నె స్టేడియం, పుణెలోని ఎంఏసీ మైదానాల్లో 15 మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహించనుంది. ఒక్కో జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‌లను ఆడతాయి. దీని కోసం పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించింది.
ఇదీ చదవండి: IPL 2022: ధోనీ మళ్లీ అలాగే చేస్తాడా?