క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం నిర్ణయించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో (ECB) చర్చల అనంతరం స్టేడియం కెపాసిటీలో 60 శాతం మందికి అనుమతివ్వనున్నట్లు తెలుస్తోంది.
భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ తొలి దశలో అభిమానులు లేకుండానే మ్యాచ్లు జరిగాయి. కరోనా రెండో దశను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 29 మ్యాచ్ల తర్వాత పలువురు ఆటగాళ్లు కొవిడ్ బారిన పడ్డారు. దీంతో టోర్నీని వాయిదా వేయాల్సి వచ్చింది.