ఐపీఎల్ సందర్భంగా ఇద్దరు బుకీలకు నకిలీ అనుమతి కార్డులు జారీ చేసిన ఇద్దరిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ బెట్టింగ్లతో సంబంధముందనే కారణంతో వీరేందర్ సింగ్ షా, బాలం సింగ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో హైదరాబాద్-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వీరిద్దరు మనీశ్ కన్సాల్, క్రిషన్ గార్గ్.. పేరిట నకిలీ కార్డులను రూపొందించినట్లు పోలీసులు పేర్కొన్నారు.