ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీకి మరోసారి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ.. తాజాగా చేసిన టెస్టులో వైరస్ నిర్ధరణ అయింది.
ఐపీఎల్లో కరోనా సోకిన తొలి విదేశీయుడు హస్సీనే కావడం విశేషం. మూడ్రోజుల కిందట చేసిన పరీక్షల్లో అతనికి నెగెటివ్ నివేదిక వచ్చింది. దీంతో హస్సీ వేగంగా కోలుకున్నట్లు అనిపించింది. కానీ స్వల్ప లక్షణాలు ఉండడం వల్ల మరోసారి అతనికి కొవిడ్ టెస్టు చేశారు.